రాజమౌళి ‘RRR’ లో ప్రియమణి..?

Thursday,November 29,2018 - 04:18 by Z_CLU

ఫాస్ట్ పేజ్ లో షూటింగ్ జరుపుకుంటుంది రాజమౌళి RRR. ప్రస్తుతం NTR, రామ్ చరణ్ కాంబినేషన్ లో ఇంట్రెస్టింగ్ యాక్షన్ సీక్వెన్సెస్ తెరకెక్కించే ప్రాసెస్ లో ఉన్నాడు జక్కన్న. అయితే ఈ సినిమాలో ప్రియమణి కూడా నటించనుందా…? ఫిల్మ్ మేకర్స్ నుండి ఈ విషయంలో ఇప్పటి వరకు అప్డేట్ అయితే రాలేదు కానీ, సోషల్ మీడియాలో ఈ న్యూస్ ఇంట్రెస్టింగ్ స్పేస్ క్రియేట్ చేసుకుంటుంది.

గతంలో రాజమౌళి, NTR కాంబినేషన్ లో వచ్చిన ‘యమదొంగ’ లో హీరోయిన్ గా నటించింది ప్రియమణి. అయితే ఈ సినిమాలో కూడా కీలక పాత్రలో ప్రియమణి నటిస్తుందని తెలుస్తుంది. పక్కా ప్లానింగ్ తో సినిమాని సెట్స్ పైకి తీసుకుని వచ్చిన మేకర్స్, ఈ సినిమాలో హీరోయిన్స్ ఎవరన్నది కూడా ఇంకా సస్పెన్స్ జోన్ లోనే ఉంచారు.

ప్రస్తుతం కంప్లీట్ ఫోకస్ షూటింగ్ పెట్టిన RRR టీమ్, త్వరలో ఈ సినిమాకి సంబంధించి తక్కిన డీటేల్స్ అనౌన్స్ చేసే ఆలోచనలో ఉన్నారు. అప్పుడే ప్రియమణి రోల్ పై క్లారిటీ వస్తుంది. ఈ సినిమాని D.V.V. దానయ్య నిర్మిస్తున్నాడు. ఈ సినిమా 2020 లో రిలీజవుతుంది.