Viraataparvam రిలీజ్ డేట్ ఫిక్స్ !

Thursday,January 28,2021 - 05:39 by Z_CLU

దగ్గుబాటి రానా కామ్రేడ్ రవన్న పాత్రలో నటిస్తున్న ‘విరాటపర్వం’ సినిమా రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది. ఏప్రిల్ 30న సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. “Comrade ‘Ravanna’ is bringing a Revolution to the big screens on 30th April” అంటూ  రానా స్టిల్ తో రిలీజ్ డేట్ పోస్టర్ ను విడుదల చేశారు.

Viraataparvam-release-date-locked

రానా సరసన సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ప్రియమణి ఓ ముఖ్య పాత్రలో నటించింది. ఇటివలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. కొంత గ్యాప్ తర్వాత రానా నుండి వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొంటున్నాయి.

‘నీది నాది ఒకే కథ’ సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపు అందుకున్న వేణు ఉడుగుల దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకు సురేష్ బొబ్బిలి మ్యూజిక్ అందిస్తున్నాడు. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సురేష్ బాబు సమర్పిస్తున్న ఈ సినిమాను  శ్రీ లక్ష్మి వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థపై చెరుకూరి సుధాకర్ నిర్మిస్తున్నాడు.