Rana Daggubati - ఎట్టకేలకు సెట్స్ పైకి

Tuesday,December 01,2020 - 04:55 by Z_CLU

లాంగ్ గ్యాప్ తర్వాత మళ్లీ సెట్స్ పైకి వచ్చాడు Rana Daggubati. వేణు ఊడుగుల దర్శకత్వంలో రానా Virataparvam అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ కొత్త షెడ్యూల్ లో రానా జాయిన్ అయ్యాడు.

ప్రస్తుతం ఈ షూటింగ్ నైట్ మోడ్ లో జరుగుతోంది. రానాతో పాటు మరికొందరు కీలక నటీనటుల మధ్య సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్ కంప్లీట్ అయిన వెంటనే రానా ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్ ను ఎనౌన్స్ చేస్తారు.

తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో నక్సలిజంకు చెందిన కథతో వస్తోంది విరాటపర్వం. సాయిపల్లవి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ప్రియమణి, నందితాదాస్, నవీన్ చంద్ర, ఈశ్వరీరావు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఈ సినిమాలో రానా నక్సలైట్ గా కనిపించబోతున్నాడనే టాక్ నడుస్తోంది. సురేష్ బాబు సమర్పిస్తున్న ఈ సినిమాను, లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నాడు.