డబుల్ ధమాకా మిస్ అయిన ప్రభాస్ ఫ్యాన్స్

Thursday,April 20,2017 - 02:00 by Z_CLU

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ సినిమా ‘బాహుబలి-2’ అతి త్వరలోనే థియేటర్స్ లో సందడి చేయడానికి రెడీ అయింది.. దాదాపు 2 సంవత్సరాలుగా మోస్ట్ అవైటింగ్ మూవీ గా అందరిలో క్యూరియాసిటీ నెలకొల్పుతున్న ఈ సినిమా ఎట్టకేలకి ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా సందడి చేయడానికి సిద్ధమైంది.. ఇక ఇప్పటికే బాహుబలి-2 రిలీజ్ తో ఖుషిలో ఉన్న ఫాన్స్ కి ప్రభాస్ డబుల్ బంపర్ అఫర్ ప్లాన్ చేసాడనే వార్త సోషల్ మీడియా లో హల్చల్ చేస్తుంది…

ప్రస్తుతం యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ సుజీత్ డైరెక్షన్ లో రానున్న సాహో సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు టీజర్ కూడా ఈ వారంలోనే రిలీజ్ చేస్తున్నారనే వార్త నిన్నటి వరకూ వినిపించింది. అయితే లేటెస్ట్ గా ఆ వార్తలో సగమే నిజమని స్పష్టం చేశారు మేకర్స్. ఫస్ట్ లుక్ పోస్టర్ లాంటివేం ప్లాన్ చేయలేదని క్లారిటీ ఇచ్చారు. ఓన్లీ టీజర్ పై మాత్రమే దృష్టి పెట్టామని… తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం భాషల్లో టీజర్ ఉంటుందని ప్రకటించారు.

ఈనెల 28న ప్రపంచవ్యాప్తంగా బాహుబలి – ది కంక్లూజన్ సినిమా థియేటర్లలోకి రానుంది. ఈ సినిమా ఇంటర్వెల్ టైమ్ లో సాహో టీజర్ ప్లే చేస్తారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై దాదాపు 150 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో రాబోతోంది సాహో సినిమా.