వీకెండ్ రిలీజ్

Thursday,April 20,2017 - 03:08 by Z_CLU

ఈ సారి వీకెండ్ రిలీజ్ సినిమాల మధ్య గట్టి పోటీ కనిపిస్తుంది. డిఫెరెంట్ డిఫెరెంట్ జోనర్స్ తో తెరకెక్కిన సినిమాలు సినిమా లవర్స్ ని ఎంటర్ టైన్ చేయడానికి రెడీ అయిపోయాయి. వాటి డీటేల్స్ పై ఓ లుక్కేసేద్దాం.

 

లంక

 

రాశి ప్రధాన పాత్రలో హై ఎండ్ థ్రిల్లర్ గా తెరకెక్కింది లంక. శ్రీముని డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాని నాన దినేష్, విష్ణు కుమార్ కలిసి నిర్మించారు. రిలీజ్ కి ముందు నుండే ఇంటరెస్టింగ్ ట్రేలర్ తో ఎట్రాక్ట్ చేసిన సినిమా యూనిట్ సినిమా బ్లాక్ బస్టర్ గ్యారంటీ అని కాన్ఫిడెంట్ గా ఉంది. ఈ ఫ్రైడే బాక్సాఫీస్ బరిలో గట్టి పోటీ ఇవ్వడానికి రెడీగా ఉంది లంక.

 

ఇద్దరి మధ్య 18

రామ్ కార్తీక్, భానుత్రిపాత్రి జంటగా నటించిన రొమాంటిక్ మెసేజ్ ఓరియంటెడ్ ఎంటర్ టైనర్ నీకు నాకు మధ్య 18. నాని ఆచార్య డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాని శివరాజ్ పాటిల్ నిర్మించాడు. ఘంటాడి కృష్ణ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ సినిమా ఈ ఫ్రై డే రిలీజవుతుంది.

పిశాచి 2

డేంజర్ జోన్ అనే ట్యాగ్ లైన్ తో తెరకెక్కిన ‘ పిశాచి 2’ ఫ్రై డే రిలీజ్ కి రెడీగా ఉంది. పిశాచి వల్ల ఒక ఊళ్ళో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కున్నారు..? చివరికి ఆ సమస్య నుండి ఎలా బయటపడ్డారు అన్నదే ఈ సినిమా ప్రధాన కథాంశం. కన్నడలో బ్లాక్ బస్టర్ అయిన ఈ సినిమా, తెలుగులోనూ అదే రేంజ్ సక్సెస్ ని రీచ్ అవుతుందని కాన్ఫిడెంట్ గా ఉంది సినిమా యూనిట్. దేవరాజ్ కుమార్ ఈ సినిమాకి డైరెక్టర్.

మాచిదేవ

హిస్టారికల్ కంటెంట్ తో తెరకెక్కింది ‘మాచిదేవ’ సాయి కుమార్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమా కూడా టాలీవుడ్ లో ఈ ఫ్రైడే స్పేస్ క్రియేట్ చేసుకుంది. ఈ ఫ్రైడే రిలీజవుతున్న సినిమాలలో హిస్తారికల్ కంటెంట్ తో రిలీజవుతున్న సినిమా ఇదొక్కటే.  నంది కామేశ్వర రెడ్డి ఈ సినిమాకి డైరెక్టర్. ద్వారంపూడి శివ శంకర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకి హంసలేఖ మ్యూజిక్ కంపోజర్.

బ్లాక్ మనీ 

మోహన్ లాల్, అమలా పాల్ కీలక పాత్రల్లో బ్లాక్ మనీ నేపథ్యంలో తెరకెక్కిన సినిమా ‘బ్లాక్ మనీ’ . జోషిలీ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాని సయ్యద్ నిజాముద్దీన్ నిర్మించారు. రతీష్ వెగ ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజర్. ఈ సినిమా కూడా ఈ ఫ్రై డే గ్రాండ్ గా రిలీజవుతుంది.

రిజర్వేషన్

 

డాక్టర్ శివానంద యాలాల డైరెక్షన్ లో సోషల్ మెసేజ్ తో తెరకెక్కిన సినిమా ‘రిజర్వేషన్’. ఈ సినిమా తెలుగుతో పాటు ఇంగ్లీష్, హిందీ భాషల్లో ’Reserve A Nation’ పేరుతో నిలుస్తుంది. ఈ ఫ్రైడే రిలీజ్ కి రెడీగా ఉన్న ఈ సినిమా యూనిట్ సినిమా సక్సెస్ గ్యారంటీ అని కాన్ఫిడెంట్ గా ఉంది.

నూర్

సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రలో తెరకెక్కిన బాలీవుడ్ సినిమా ‘నూర్’. సునీల్ సిప్పీ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ఫ్రైడే రిలీజవుతుంది. సాబా ఇంతియాజ్ రాసిన పాప్యులర్ నవల ‘కరాచీ- యు ఆర్ కిల్లింగ్ మీ’ నవల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాని భూషణ్ కుమార్ నిర్మించాడు. ఆమాల్ మాలిక్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు.

మాత్ర్

రవీనాటాండన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన అల్టిమేట్ థ్రిల్లర్ ‘మాత్ర్’. ఈ ఫ్రైడే రిలీజ్ కి రెడీగా ఉన్న ఈ సినిమాని అష్తార్ సయ్యద్ డైరెక్టర్. మైఖేల్ పిలికో ప్రొడ్యూసర్. ఫుజాన్ ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేశాడు.