Kanguva Glimpse అంచనాలు పెంచేసిన సూర్య

Saturday,July 22,2023 - 11:55 by Z_CLU

సూర్య హీరోగా శివ  దర్శకత్వంలో ‘కంగువ’ అనే టైటిల్ తో ఓ భారీ సినిమా రూపొందనుందని న్యూస్ వచ్చినప్పటి నుండే సినిమాపై భారీ బజ్ నెలకొంది. అసలు ‘కంగువ’ అనే టైటిల్ ఎందుకు పెట్టారు ? సూర్య ఎలా కనిపిస్తాడు ? అనే ప్రశ్నలకు తాజాగా టీజర్ గ్లిమ్స్ తో ఆన్సర్ ఇచ్చారు మేకర్స్.

యుద్ద వీరుడుగా సూర్య నటిస్తున్న కంగువ క్యారెక్టర్ ను ఎలివేట్ చేస్తూ రెండు నిమిషాల గ్లిమ్స్ ను వదిలారు. కంగువ ఎలాంటి వాడు , ఎంత వైల్డ్  ? ఎలాంటి యుద్దాలు చేస్తాడు ? అనే విషయాలను చెప్తూ చూపిస్తూ రిలీజ్ చేసిన గ్లిమ్స్ స్టన్నింగ్ విజువల్స్ తో సినిమాపై భారీ ఎక్స్ పెక్టేషన్స్ పెంచేసింది. ముఖ్యంగా సూర్య కేరెక్టర్ , గెటప్ , అదిరిపోయే విజువల్స్ , దేవి శ్రీ ప్రసాద్ టెర్రిఫిక్ స్కోర్ తో కంగువ గ్లిమ్స్ మెప్పించింది. మ్యూజిక్ , సౌండ్ డిజైనింగ్, కెమెరా వర్క్ , ఆర్ట్ వర్క్ , కాస్ట్యూమ్స్ ఇలా అందరూ టెక్నీషియన్స్ ఈ కినేమకు తమ పూర్తి ఎఫర్ట్ పెట్టి వర్క్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. కమర్షియల్ సినిమాలతో కలెక్షన్స్ కొల్లగొట్టి తనకంటూ ఓ బ్రాండ్ క్రియేట్ చేసుకున్న దర్శకుడు శివ ‘కంగువ’తో తన పూర్తి ఎఫర్ట్ పెట్టి అందరినీ షాక్ చేయబోతున్నాడ నిపిస్తుంది.

భారీ బడ్జెట్ తో రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా పార్ట్ 1 వచ్చే ఏడాది  ఏప్రిల్ 12 న ప్రేక్షకుల ముందుకు రానుంది. తమిళ్ , తెలుగు , కన్నడ , మలయాళం , హిందీ భాషలతో పాటు మొత్తం పది భాషల్లో పాన్ ఇండియా మూవీగా 3D లో రిలీజ్ కానుంది. స్టూడియో గ్రీన్ , యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు.