ప్రభాస్-నాగ్ అశ్విన్ మూవీ అప్ డేట్స్

Tuesday,May 05,2020 - 04:49 by Z_CLU

నాగ్ అశ్విన్ డైరక్షన్ లో ఓ మూవీ చేయడానికి ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అత్యంత భారీ బడ్జెట్ తో రాబోతున్న ఈ పాన్-ఇండియన్ మూవీకి సంబంధించి తాజాగా స్క్రీన్ ప్లే పూర్తయింది.

స్టోరీ డిస్కషన్స్ పూర్తయి స్క్రిప్ట్ లాక్ అవ్వడంతో ఇప్పుడు ప్రీ-ప్రొడక్షన్ పై దృష్టిపెట్టాడు దర్శకుడు నాగ్ అశ్విన్. దేశంలోని దాదాపు అన్ని ముఖ్యమైన భాషల్లో ఈ సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. దానికి తగ్గట్టుగా బాలీవుడ్ ఆర్టిస్టుల్ని ఎంపిక చేయాలని భావిస్తున్నాడట.

సైన్స్ ఫిక్షన్ కాన్సెప్ట్ తో రాబోతోంది ప్రభాస్-నాగ్ అశ్విన్ మూవీ. లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం ఈ సినిమాలో సూపర్ హీరోగా కనిపించబోతున్నాడు యంగ్ రెబల్ స్టార్. ప్రస్తుతం చేస్తున్న మూవీ కంప్లీట్ అయిన వెంటనే నాగ్ అశ్విన్ సినిమా సెట్స్ పైకి వస్తుంది.