జీ సినిమాలు - మే 6

Tuesday,May 05,2020 - 07:54 by Z_CLU

బొబ్బిలిరాజా
హీరో హీరోయిన్లు – వెంకటేశ్, దివ్యభారతి
ఇతర నటీనటులు – వాణిశ్రీ, సత్యనారాయణ, కోటశ్రీనివాసరావు, బ్రహ్మానందం, బాబుమోహన్, గుమ్మడి
సంగీత దర్శకుడు – ఇళయరాజా
దర్శకుడు – బి.గోపాల్
విడుదల తేదీ – 1990
ఫ్యామిలీ డ్రామా, ఎమోషన్ కలగలిసిన ఓ మంచి కథకు, అదిరిపోయే సంగీతం యాడ్ అయితే ఎలా ఉంటుందో అదే బొబ్బిలి రాజా సినిమా. బి.గోపాల్,వెంకటేష్ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా వెంకీ కెరీర్ లో ఓ తిరుగులేని బ్లాక్ బస్టర్ గా నిలిచిపోయింది. అటు సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ కు కూడా భారీగా లాభాలు తెచ్చిపెట్టిన మూవీస్ లో ఇది కూడా ఒకటి. అయ్యో..అయ్యో..అయ్యయ్యో అనే సూపర్ హిట్ డైలాగ్ ఈ సినిమాలోనిదే. రీసెంట్ గా బాబు బంగారం సినిమాలో కూడా వెంకీ ఇదే డైలాగ్ ఉపయోగించారు. ఇక ఈ సినిమాలో పాటల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. తన సంగీతంతో ఇళయరాజా ఈ సినిమాను మరో రేంజ్ కు తీసుకెళ్లారు. ఇప్పటికీ ఈ సినిమాలో పాటలు అంతే ఫ్రెష్ గా ఉంటాయి. వెంకటేశ్ కెరీర్ లోనే మొట్టమొదటి సిల్వర్ జూబ్లీ సినిమాగా పేరుతెచ్చుకున్న బొబ్బిలిరాజా.. 3 సెంటర్లలో 175 రోజులు ఆడింది. తర్వాత ఇదే మూవీ తమిళ్ లో వాలిబన్, హిందీలో రామ్ పూర్ కా రాజా పేరుతో విడుదలై… అక్కడ కూడా విజయం సాధించడం కొసమెరుపు.

===============================

అదిరిందయ్యా చంద్రం
నటీనటులు – శివాజీ, లయ
ఇతర నటీనటులు – సంగీత, మధుశర్మ, బ్రహ్మానందం, అలీ, వేణుమాధవ్, ఏవీఎస్
మ్యూజిక్ డైరెక్టర్ – ఎం.ఎం.శ్రీలేఖ
డైరెక్టర్ – శ్రీనివాసరెడ్డి
రిలీజ్ డేట్ – 2005, ఆగస్ట్ 20
శివాజీ, లయ కలిసి నటించిన కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అదిరిందయ్యా చంద్రం. శివాజీ కెరీర్ లో సూపర్ హిట్ సినిమాల్లో ఒకటిగా ఇది నిలిచిపోతుంది. శివాజీలో అదిరిపోయే కామెడీ టైమింగ్ ఉందని మరోసారి నిరూపించింది ఈ సినిమా.

=================================

రారండోయ్ వేడుక చూద్దాం
నటీనటులు : అక్కినేని నాగచైతన్య, రకుల్ ప్రీత్ సింగ్
ఇతర నటీనటులు : జగపతి బాబు, సంపత్ రాజ్, వెన్నెల కిషోర్, పోసాని కృష్ణ మురళి, పృథ్విరాజ్, చలపతి రావు మరియు తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : దేవి శ్రీ ప్రసాద్
డైరెక్టర్ : కళ్యాణ్ కృష్ణ కురసాల
ప్రొడ్యూసర్ : నాగార్జున అక్కినేని
రిలీజ్ డేట్ : 26 మే 2017
పల్లెటూరిలో ఓ పెద్దమనిషిగా కొనసాగే ఆది(సంపత్) ఏకైక కూతురు భ్రమరాంబ(రకుల్ ప్రీత్) చిన్నతనం నుంచి నాన్న గారాల పట్టిగా పెరిగి పెద్దవుతుంది. అలా నాన్నని కుటుంబాన్ని అమితంగా ప్రేమించే భ్రమరాంబను కజిన్ బ్రదర్ పెళ్లిలో చూసి మొదటి చూపులోనే ప్రేమలో పడతాడు శివ(నాగ చైతన్య). అలా భ్రమరాంబతో ప్రేమలో పడిన శివ.. ఆదికి తన తండ్రి కృష్ణ(జగపతి బాబు) కి గొడవ ఉందని ఆ గొడవే తన ప్రేమకు అడ్డుగా మారిందని తెలుసుకుంటాడు.ఇంతకీ ఆది-కృష్ణ కి ఏమవుతాడు..? వారిద్దరి మధ్య గొడవేంటి.. చివరికి శివ-భ్రమరాంబ కలిశారా లేదా అనేది స్టోరీ.

============================

మిస్టర్
నటీనటులు : వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి
ఇతర నటీనటులు : హేబా పటేల్, నిఖితిన్ ధీర్, ప్రిన్స్ సీసిల్, పృథ్వీ రాజ్, హరీష్ ఉత్తమన్, రవి ప్రకాష్, సత్యం రాజేష్ మరియు తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : మిక్కీ. జె. మేయర్
డైరెక్టర్: శ్రీను వైట్ల
ప్రొడ్యూసర్ : 7నల్లమలుపు బుజ్జి, ఠాగూర్ మధు
రిలీజ్ డేట్ : 14 ఏప్రిల్ 2017
చిన్నతనంలోనే తల్లిని కోల్పోయి తాతకు దూరంగా తన కుటుంబంతో యూరప్ లో జీవితాన్ని కొనసాగిస్తున్న పిచ్చై నాయుడు (వరుణ్ తేజ్) అనుకోని సందర్భంలో యూరప్ కి వచ్చిన మీరా(హెబ్బా పటేల్) తో మొదటి చూపులోనే ప్రేమలో పడతాడు. మీరా యూరప్ వదిలి వెళ్ళేలోపు తన ప్రేమను చెప్పాలనుకున్న చై.. మీరా చెప్పిన ఓ నిజం విని షాక్ అవుతాడు… అలా మీరా జీవితం గురించి తెలుసుకొని షాక్ అయిన చై జీవితంలోకి చంద్రముఖి(లావణ్య త్రిపాఠి) అనే అమ్మాయి ఎంట్రీ ఇస్తుంది. ఇంతకీ మీరా, చై కి ఏం చెప్పింది? చై జీవితంలోకి అనుకోకుండా వచ్చిన చంద్రముఖి ఎవరు? చివరికి వీరిద్దరిలో చై ఎవరిని పెళ్లిచేసుకుంటాడు.. ఇక చిన్నతనంలోనే చై తన తాతకి దూరం అవ్వడానికి కారణం ఏమిటి.? ఫైనల్ గా చై మళ్ళీ తన తాతయ్యను ఎలా కలిశాడు.. అనేది సినిమా కథాంశం.

============================

దమ్ము
నటీనటులు : N.T.R, త్రిష కృష్ణన్, కార్తీక నాయర్
ఇతర నటీనటులు : వేణు తొట్టెంపూడి, అభినయ, భానుప్రియ, నాజర్, సుమన్, బ్రహ్మానందం, కోట శ్రీనివాస రావు, సంపత్ రాజ్, కిషోర్ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : M.M. కీరవాణి
డైరెక్టర్ : బోయపాటి శ్రీను
ప్రొడ్యూసర్ : అలెగ్జాండర్ వల్లభ
రిలీజ్ డేట్ : 27 ఏప్రియల్ 2012
బోయపాటి శ్రీను డైరెక్షన్ లో తెరకెక్కిన అల్టిమేట్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ దమ్ము. N.T.R స్టామినా పర్ ఫెక్ట్ గా ఎలివేట్ అయిన ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందించాడు. యాక్షన్ సీక్వెన్సెస్ సినిమాకి హైలెట్ గా నిలిచాయి.

==================================

ఎక్కడికి పోతావ్ చిన్నవాడా
నటీనటులు : నిఖిల్ సిద్ధార్థ, హేబా పటేల్, అవిక గోర్
ఇతర నటీనటులు : నందితా శ్వేత, వెన్నెల కిషోర్, అన్నపూర్ణ, సత్య, సుదర్శన్ మరియు తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : శేఖర్ చంద్ర
డైరెక్టర్ : వి. ఐ. ఆనంద్
ప్రొడ్యూసర్ : P.V. రావు
రిలీజ్ డేట్ : 18 నవంబర్ 2016
ఒక అమ్మాయిని ప్రేమించి మోసపోయిన అర్జున్(నిఖిల్) తన స్నేహితుడి అన్నయ్య కు దెయ్యం వదిలించడానికి అనుకోకుండా ఆత్మలను వదిలించే కేరళ లోని మహిశాసుర మర్దిని గుడికి వెళ్లాల్సి వస్తుంది. అలా కిషోర్(వెన్నెల కిషోర్) తో కేరళ వెళ్లిన అర్జున్ కి అమల(హెబ్బా పటేల్) అనే అమ్మాయి పరిచయం అవుతుంది. అలా పరిచయమైన అమల తన యాటిట్యూడ్ తో అర్జున్ కు దగ్గరవుతుంది. ఇంతకీ అమల అక్కడికి ఎందుకొచ్చింది? అర్జున్ కి కావాలనే ఎందుకు దగ్గరైంది? అసలు అమల ఎవరు? కేరళ వెళ్లిన అర్జున్ హైదరాబాద్ తిరిగొచ్చాక అమల గురించి ఏం తెలుసుకున్నాడు? అనేది చిత్ర కధాంశం.