జీ ఎక్స్ క్లూజీవ్: ప్రభాస్ మూవీపై క్లారిటీ

Thursday,May 14,2020 - 01:59 by Z_CLU

 

ఒక సీక్వెల్ గురించి నిర్మాత ఎక్కడినా మాట్లాడితే చాలు…. ఇక ఆ హీరోతో ఈ సీక్వెల్, ఈ హీరో చేస్తున్నాడంటూ రకరకాల రూమర్స్ చక్కర్లు కొడుతుంటాయి. ప్రస్తుతం ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ క్లాసిక్ మూవీ సీక్వెల్ కి సంబంధించి ఇలాగే పలు పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. ఈమధ్య ఓ ఇంటర్వ్యూలో నిర్మాత అశ్వనీదత్ మాట్లాడుతూ.. ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ సీక్వెల్ ఆలోచన ఉందని, అది నిర్మించాకే నిర్మాతగా రిటైర్ అవుతానంటూ స్టేట్ మెంట్ ఇవ్వడమే దానికి కారణం.

దీంతో ప్రస్తుతం వైజయంతి మూవీస్ బ్యానర్ లో ప్రభాస్ చేయబోతున్న సినిమాకు, ఆ సీక్వెల్ కు లింక్ను పెట్టేశారు చాలామంది. సినిమాలో ప్రభాస్ సూపర్ మేన్ గా కనిపిస్తాడనే ఓ ఎలిమెంట్ ను పట్టుకొని దీనికి, అలనాటి క్లాసిక్ కి సింక్ చేసి స్టోరీలు అల్లేశారు.

అయితే ఈ విషయంపై నిర్మాత స్వప్న దత్ ‘జీ సినిమాలు’తో మాట్లాడారు. జగదేకవీరుడు అతిలోకసుందరి సీక్వెల్ పై వస్తున్న రూమర్స్ లో నిజం లేదని కొట్టి పారేశారు. సీక్వెల్ కి సంబంధించి ఆలోచన మాత్రమే ఉందని, ఇంకా దాని గురించి ఎలాంటి డిస్కషన్ లేదన్నారు. ప్రభాస్-నాగ్ అశ్విన్ కాంబోలో రాబోతున్న సినిమాకు ఆ సీక్వెల్ కి ఎలాంటి సంబంధం లేదని తేల్చిచెప్పారు స్వప్న దత్.

ప్రభాస్ తో సినిమా గురించి ఇప్పుడే ఎలాంటి హింట్స్ ఇవ్వలేమని , కానీ కచ్చితంగా అందరిని సప్రయిజ్ చేసే స్థాయిలో సినిమా ఉండబోతుందని అన్నారు.