Prabhas NagAshwin Movie - మరో ఇంట్రెస్టింగ్ బజ్!

Friday,May 28,2021 - 04:10 by Z_CLU

గతేడాది పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో సినిమా ఎనౌన్సయిన సంగతి తెలిసిందే. వైజయంతి మూవీస్ బేనర్ పై అశ్వినిదత్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించి స్టోరీపై ఓ ప్రచారం జరుగుతుంది. ఈ సినిమాను నాగ్ అశ్విన్ టైం ట్రావెల్ జోనర్ లో తెరకెక్కించనున్నాడని, సినిమాను మన ఫ్యూచర్ చూపించే కథతో రూపొందించనున్నాడని అంటున్నారు. దీనికోసం నాగ్ అశ్విన్ 2050 సంవత్సరం సెలెక్ట్ చేసుకొని స్క్రిప్ట్ రెడీ చేశాడని తెలుస్తుంది. ప్రస్తుతం కథకు సంబంధించి తుది మెరుగులు దిద్దే పనిలో బిజీగా ఉన్నాడు దర్శకుడు.

నిజానికి ఈ ప్రచారంలో అంతో ఇంతో నిజం లేకపోలేదు. సినిమాలో టైం ట్రావెల్ నేపథ్యం ఉన్నందునే ఈ టైప్ సినిమా చేసిన సీనియర్ దర్శకుడు సింగీతం శ్రీనివాస్ ను ప్రాజెక్ట్ సూపర్వైజర్ గా తీసుకున్నాడు నాగ్ అశ్విన్. సింగీతం గారి ఆలోచనలు, ఆయన అనుభవంతో ఇచ్చే సూచనలు ప్రభాస్ సినిమాకు బాగా ఉపయోగపడనున్నాయి. పాన్ ఇండియా లెవెల్ లో అధిక బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ సినిమాకు ఇప్పటికే ఓ స్పెషల్ రోల్ కోసం బాలీవుడ్ నుండి బిగ్ బి అమితాబ్ ను అలాగే హీరోయిన్ గా దీపిక పదుకునే ని ఫైనల్ చేసుకొని వెల్కం చెప్పేశారు మేకర్స్.

  • deepika padukone

    దీపిక పదుకోన్

ఇక మిగతా పాత్రలకు సంబంధించి కూడా త్వరలోనే డీటెయిల్స్ బయటికి రానున్నాయి. ఇతర భాషల నుండి కూడా నటులను తీసుకుని ప్రాజెక్ట్ కి ఇంకా క్రేజ్ పెంచే ప్లానింగ్ లో ఉన్నాడు నాగ్ అశ్విన్. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజిలో ఉన్న ఈ భారీ ప్రాజెక్ట్ నవంబర్ నుండి సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో రెండు భారీ సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి ప్రశాంత్ నీల్ తో చేస్తున్న ‘సలార్’ కాగా మరొకటి ఓం రౌత్ డైరెక్షన్ లో నటిస్తున్న ‘ఆదిపురుష్’ . ఈ రెండు సినిమాలకు సంబంధించి మేజర్ షూట్ పూర్తి చేసి నాగ్ అశ్విన్ సినిమాను సెట్స్ పైకి తీసుకురానున్నాడు ప్రభాస్. ఈ లోపు నాగ్ అశ్విన్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఫినిష్ చేసి షెడ్యుల్ కి ప్లాన్ రెడీ చేస్తాడు.

  • – Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics