ప్రభాస్ – ఆరేళ్ళ తరవాత...

Saturday,July 06,2019 - 10:02 by Z_CLU

ప్రభాస్ ని ఆరేళ్ళ తరవాత స్టైలిష్ లుక్స్ లో చూస్తున్నారు ఫ్యాన్స్. అప్పుడెప్పుడో 2013 లో ‘మిర్చి’ లో కనిపించిన ప్రభాస్ ఇప్పుడు ‘సాహో’ లో మళ్ళీ అదే స్థాయి స్టైలిష్ లుక్స్ లో మెస్మరైజ్ చేస్తున్నాడు. నిన్న రిలీజైన ‘సైకో సయ్యా’ సాంగ్ టీజర్ లో ప్రభాస్ కనిపించింది కొన్ని సెకన్సే అయినా, సోషల్ మీడియాలో ఈ వీడియో చుట్టూ హెవీ హీట్ జెనెరేట్ అవుతుంది.

‘బాహుబలి’ తరవాత ఏకంగా రెండేళ్ళ గ్యాప్ తరవాత మళ్ళీ తెరమీద కనిపించబోతున్నాడు ప్రభాస్. బాహుబలి లో ప్రభాస్ రాజసం చూశారు ఫ్యాన్స్… రాజుల కాలం నాటి వీరుడిగా చూశారు… కానీ ‘సాహో’ లో యంగ్ ఎనర్జిటిక్ ప్రభాస్ ని చూడబోతున్నారు. ఇన్నాళ్ళుగా ప్రభాస్ నుండి ఫ్యాన్స్ ఏం మిస్సవుతున్నారో ఒక్కసారిగా కళ్ళముందు నిలిపింది ఈ ‘సైకో సయ్యా’ సాంగ్ టీజర్.

ఇక ‘సాహో’ లో ఎగ్జాక్ట్ గా ప్రభాస్ ప్లే చేస్తున్న క్యారెక్టర్ ఏంటనేది ఇంకా సస్పెన్సే.. దానికి తోడు మేకర్స్ ఈ సినిమా నుండి ఏం రిలీజ్ చేసినా, సినిమాపై క్యూరియాసిటీ పెంచే ప్రయత్నమే తప్ప, సినిమాకి సంబంధించి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా రివీల్ చేయడం లేదు. దాంతో న్యాచురల్ గానే ‘సాహో’ చుట్టూ భారీ స్థాయిలో హైప్ క్రియేట్ అవుతుంది.

ముందుగా టీజర్ ఆ తరవాత చిన్నగా సాంగ్ టీజర్.. ఈ వరసలో మరింత ఎట్రాక్టివ్ గా సినిమా ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. మరోవైపు ఫ్యాన్స్ ఈ సినిమా నుండి చిన్న వీడియో రిలీజైనా అంతే గ్రాండ్ గా రిసీవ్ చేసుకుంటున్నారు.