అల్లు అర్జున్ వ్యానిటీ వ్యాన్ ప్రత్యేకతలు

Saturday,July 06,2019 - 11:03 by Z_CLU

అల్లు అర్జున్ తనకోసం ప్రత్యేకంగా తయారు చేయించుకున్న వ్యానిటీ వ్యాన్ కి సంబంధించిన ఫోటోలు స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేశాడు. తన లైఫ్ లో ఏది కొనుక్కున్నా, ఏ స్థాయికి అది ఫ్యాన్స్ వల్లే.. వారి అంతులేని అభిమానం వల్లే అని కూడా అని చెప్పుకున్నాడు… అయితే ఈ వ్యానిటీ వ్యాన్ ఇంత స్పెషల్ అనిపించుకోవడానికి కొన్ని రీజన్స్… 7 కోట్ల విలువైన ఈ వ్యానిటీ వ్యాన్ కి కొన్ని ప్రత్యేకతలున్నాయి…

అద్భుతమైన క్యాబిన్ : ఈ వ్యాన్ గురించి మాట్లాడాల్సి వస్తే ఫస్ట్ క్యాబిన్ గురించే మాట్లాడాలి.  ఈ క్యాబిన్ లో జస్ట్ అల్లు అర్జున్ కోసమే కాకుండా, షూటింగ్ సమయాల్లో బన్ని టీమ్ మొత్తం ట్రావెల్ చేసేంత స్పేస్ ఉంటుంది. ఈ క్యాబిన్ లో మేకప్ రూమ్ దగ్గరి నుండి స్నానాల గది వరకు ఉంటాయి.

 స్పెషల్ చెయిర్ : ఈ వ్యానిటీ వ్యాన్ లో ఉన్న చెయిర్ గురించి స్పెషల్ గా మెన్షన్ చేయాలి. ఎలక్ట్రికల్ కంట్రోల్ లో ఉండే ఈ చేయిర్, అన్ని రకాలుగా పనికొస్తుంది. మేకప్ వేసుకునే సమయంలో వీలుగా ఉంటుంది. దానికి ఎగ్జకాట్ ఎదురుగా పెద్ద అద్దం ఉండటంతో కావలసినంత కంఫర్ట్ గా ఉంటుంది. ఇక మేకప్ సమయంలో కాకుండా రిలాక్స్ అవ్వాలనుకున్నప్పుడు  అదే చెయిర్ ఫ్లాట్ గా ట్రాన్స్ ఫామ్ అవుతుంది. అంతేనా.. ఈ రెండింటితో పాటు విజిటర్స్ తో స్పెండ్ చేయాలనుకుంటే అదే చెయిర్ ని రివర్స్ డైరక్షన్ లో మూవ్ చేస్తే సరిపోతుంది.  వీటన్నింటికి జస్ట్ రిమోట్ వాడితే చాలు. ఎందుకంటే ఇందంతా ఎలక్ట్రానిక్ సెటప్ మరీ…

లైఫ్ టైమ్ గ్యారంటీ :  భారత్ బెంజ్ బ్రాండ్ కి సంబంధించిన ఈ వ్యానిటీ వ్యాన్ కి లైఫ్ టైమ్ గ్యారంటీ… ఫ్యూచర్ లో ఏ చిన్న సమస్య వచ్చినా… బ్రాండెడ్ సొల్యూషన్ ఉంటుంది.

ఎట్రాక్టివ్ ఎక్స్ టీరియర్స్ :  ఒక్క ముక్కలో చెప్పాలంటే స్టైలిష్ స్టార్ కి తగ్గట్టు డిజైన్ అయిన, స్టైలిష్ వ్యానిటీ వ్యాన్… కంప్లీట్ గా బ్లాక్ థీమ్ తో తయారైన ఈ వ్యానిటీ వ్యాన్ రాయల్ లుక్స్ తో మెస్మరైజ్ చేస్తుంది. దానిపై అల్లు అర్జున్ లోగో ప్రత్యెక ఆకర్షణ.