సాహో – ఐటమ్ సాంగ్ అయినా బాలీవుడే..

Saturday,July 13,2019 - 11:02 by Z_CLU

‘సాహో’ లో ఆల్మోస్ట్ షూటింగ్ కంప్లీట్ అయింది. కాకపోతే ఓ ఐటమ్ సాంగ్ బ్యాలన్స్ ఉంది. అయితే సినిమాలో కీ వీక్వెన్స్ లో ఉండబోతున్న ఈ సాంగ్ ని మరింత స్పెషల్ గా తెరకెక్కించే ఆలోచనలో ఉన్నారు. అందుకే ఈ సాంగ్ లో ప్రభాస్ సరసన స్టెప్పులేయడానికి బాలీవుడ్ భామని ఎంచుకునే ప్రాసెస్ లో ఉన్నారు మేకర్స్.

నిజానికి సినిమాలో మ్యాగ్జిమం స్టార్ కాస్ట్ ముంబై నుండే ఎంచుకున్నారు. అందుకే సినిమాకి ఆ స్థాయి గ్రాండియర్ ఆడ్ అయింది. అందుకే ఐటమ్ సాంగ్ విషయంలో కూడా అంతే సీరియస్ గా సాహో టీమ్, నొటెడ్ బాలీవుడ్ హీరోయిన్ డేట్స్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇంకా కన్ఫమ్ అయిందా లేదా అన్నది క్లారిటీ లేదు కానీ రీసెంట్ జాక్లిన్ ఫెర్నాండెజ్ ని ఈ సాంగ్ కోసం అప్రోచ్ అయ్యారట మేకర్స్. మరి అక్కడ నుండి ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో సాంగ్ సెట్స్ పైకి వస్తే గాని తెలీదు.

ప్రభాస్ సరసన హీరోయిన్ గా శ్రద్దా కపూర్ ఈ సినిమాతో టాలీవుడ్ కి పరిచయమవుతుంది. మరి స్పెషల్ సాంగ్ తో తెలుగు ఆడియెన్స్ కి దగ్గర కాబోతున్న ఆ స్పెషల్ గాళ్ ఎవరో చూడాలి…