కర్ణాటకలో పవర్ స్టార్ అజ్ఞాతవాసి

Friday,October 13,2017 - 11:46 by Z_CLU

పవన్ కళ్యాణ్ ‘అజ్ఞాతవాసి’ ఫాస్ట్ పేజ్ లో షూటింగ్ జరుపుకుంటుంది. జనవరి 10 న సంక్రాంతి కానుకగా రిలీజ్ కానున్న ఈ సినిమా ప్రస్తుతం కర్ణాటకలోని చిక్మగళూర్ లో షూటింగ్ జరుపుకుంటున్న సినిమా యూనిట్, మరో 3 రోజుల్లో ఈ షెడ్యూల్ కి ప్యాకప్ చెప్పనుంది.

ఈ షెడ్యూల్ తరవాత ఇమ్మీడియట్ గా యూరోప్ కి బయలుదేరనున్న సినిమా యూనిట్, ఈ షెడ్యూల్ లో సాంగ్స్ తెరకెక్కించే ప్లానింగ్ లో ఉంది. మ్యాగ్జిమం నవంబర్ కల్లా షూటింగ్ కి ప్యాకప్ చెప్పే ప్లానింగ్ లో ఉంది సినిమా యూనిట్.

త్రివిక్రమ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కీర్తి సురేష్, అనూ ఇమ్మాన్యువెల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఖుష్బూ తో పాటు, ఆది పినిశెట్టి కీ రోల్ ప్లే చేస్తున్నారు. అనిరుధ్  మ్యూజిక్ కంపోజర్. రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.