రేపటి నుండి మహానటి సెట్స్ పైకి సమంతా

Friday,October 13,2017 - 12:28 by Z_CLU

పెళ్ళి తరవాత ఏ మాత్రం బ్రేక్ తీసుకోకుండా ఇమ్మీడియట్ గా రాజుగారి గది 2 మూవీ ప్రమోషన్ లలో బిజీగా ఉన్న సమంతా, రేపటి నుండి మహానటి సినిమా సెట్స్ పైకి రానుంది. ముందే ప్లాన్ చేసుకున్న ప్రకారం ఈ షెడ్యూల్ తరవాత ఇమ్మీడియట్ గా రామ్ చరణ్ ‘రంగస్థలం’ షూటింగ్ లో జాయిన్ అవుతుంది సమంత.

పెళ్ళి తరవాత ఎలాంటి హాలీడే బ్రేక్ లేకుండా సినిమాలతో మళ్ళీ బిజీ అయిపోయింది సమంతా. ప్రస్తుతం రాజు గారి గది 2 కి వస్తున్న పాజిటివ్ రెస్పాన్స్ ని ఎంజాయ్ చేస్తూనే, బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కరియర్ ప్లాన్ చేసుకుంటుంది.