రాజమౌళి వరకు సరే.. మరి సుజిత్...?

Thursday,August 29,2019 - 11:02 by Z_CLU

బాహుబలి తరవాత ప్రభాస్ సుజిత్ తో సినిమా చేస్తున్నాడన్నప్పుడే ఫోకస్ ఈ యంగ్ డైరెక్టర్ పై ఫిక్సయింది. ఇప్పుడు ఈ సినిమా చుట్టూ క్రియేట్ అవుతున్న పాజిటివ్ వైబ్స్.. క్రేజ్ చూస్తుంటే సుజిత్ స్టాండర్డ్స్ తెలిసిపోతున్నాయి కానీ నిజానికి ఈ సినిమా పాసిబుల్ అయింది మాత్రం UV క్రియేషన్స్… ప్రభాస్ చేసిన ధైర్యం వల్లే… అయితే ఇలాంటి సపోర్టే సుజిత్ నెక్స్ట్ సినిమాకి కూడా దొరుకుతుందా..?

బాహుబలి తరవాత రాజమౌళి మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోలేదు.. మళ్ళీ అదే స్థాయి సినిమాని సెట్స్ పైకి తీసుకు వచ్చాడు… అందునా టాలీవుడ్ టాప్ మోస్ట్ స్టార్ హీరోలతో… ఇప్పుడు ఈ వరసలో సుజిత్ కూడా చేరబోతున్నాడా..? అలాంటి అవకాశం సుజిత్ కి కూడా దొరుకుతుందా…? లేకపోతే ఈ సినిమా తరవాత రీజనల్ సినిమాలతో సరిపెట్టుకుంటాడా..?

ప్రభాస్ చరిష్మాని కాస్త పక్కన పెడితే ‘సాహో’ ఖచ్చితంగా సుజిత్ దే.. ప్రభాస్ లాంటి స్టార్ హీరోని ఏ మాత్రం తగ్గకుండా ప్రెజెంట్ చేశాడు. కానీ ఈ వరల్డ్ క్లాస్ టెక్నికల్ మ్యాగ్నమ్ ఓపస్ వెనక చాలా మంది హాలీవుడ్ టెక్నీషియన్స్ ఉన్నారు… స్క్రీన్ పై బాలీవుడ్ స్టార్స్ ఉన్నారు.. వీళ్ళందరినీ ఒకే ట్రాక్ పైకి తీసుకురావడం.. అంత చిన్న విషయం కాదు… సుజిత్ కి దొరికిన అత్యంత పవర్ ఫుల్ ఆయుధం ఈ సపోర్టే… అందుకే ఈ వండర్ విజువల్ పాసిబుల్ అయింది. 

‘సాహో’ కి దొరికిన సపోర్టే సుజిత్ నెక్స్ట్ సినిమాలకు కూడా దొరుకుతుందా…? UV క్రియేషన్స్ స్థాయిలో సుజిత్ తో సినిమా చేయబోయే మోస్ట్ ప్యాషనేట్ ప్రొడ్యూసర్స్ ఎవరు…? జస్ట్ ఒక్క సినిమా అనుభవంతో ఇంత పెద్ద సినిమాని హ్యాండిల్ చేసిన ఈ యంగెస్ట్ ఫిలిమ్ మేకర్… ‘సాహో’ లాంటి వరల్డ్ క్లాస్ సినిమా తరవాత ఏం చేయబోతున్నాడు..? చూడాలి…