#VakeelSaab - మళ్లీ సెట్స్ పైకి పవన్

Thursday,September 10,2020 - 02:09 by Z_CLU

పవన్ రీఎంట్రీ మూవీ వకీల్ సాబ్ మరోసారి డిస్కషన్ పాయింట్ గా నిలిచింది. లాక్ డౌన్ వల్ల ఆగిపోయిన ఈ సినిమాను మళ్లీ సెట్స్ పైకి తీసుకురావడానికి రెడీ అవుతున్నాడు పవన్. ఈనెల 23 నుంచి Vakeel Saab సెట్స్ పైకి రాబోతోంది.

అయితే సినిమా సెట్స్ పైకి వచ్చినా Pawan Kalyan మాత్రం అప్పుడే జాయిన్ అవ్వట్లేదు. ముందుగా పవన్ తో సంబంధం లేని సన్నివేశాల్ని పిక్చరైజ్ చేస్తారు. ఆ షెడ్యూల్ కంప్లీట్ అయిన తర్వాత పవన్ సెట్స్ పైకొస్తాడు.

ఈ సినిమా కోసం పవన్ సరసన Shruti Hassan ను హీరోయిన్ గా తీసుకున్నారు. పవన్ తో పాటు ఆమె కూడా ఫైనల్ షెడ్యూల్ లో జాయిన్ అవుతుంది.

వేణుశ్రీరామ్ డైరక్ట్ చేస్తున్న ఈ మూవీని దిల్ రాజు, బోనీకపూర్ కలిసి నిర్మిస్తున్నారు. నివేత థామస్, అనన్య నాగళ్ల, అంజలి కీలక పాత్రల్లో కనిపిస్తారు.