Adipurush - ముందుగా సెట్స్ పైకి వచ్చేది ఇదే

Thursday,September 10,2020 - 02:19 by Z_CLU

రాధేశ్యామ్ త్వరలోనే సెట్స్ పైకి రాబోతోంది.. నాగ్ అశ్విన్ సినిమా మాత్రం టైమ్ పట్టేలా ఉంది. ఇక భారీ బడ్జెట్ తో మైథలాజికల్ మూవీగా రాబోతున్న ఆదిపురుష్ ఇంకా లేట్ అవుతుందని అంతా అనుకుంటున్నారు. కానీ ఇది నిజం కాదు.

Adipurush సినిమాను కేవలం 70 రోజుల్లో పూర్తిచేయబోతున్నాడు దర్శకుడు ఓం రౌత్. ఈ మేరకు స్క్రీన్ ప్లే, స్టోరీ బోర్డ్ తో పాటు సిద్ధంగా ఉన్నాడు. జనవరి నుంచి Prabhas ఈ సినిమా స్టార్ట్ చేయబోతున్నాడు.

అటు RadheShyam తో పాటు ఇటు ఆదిపురుష్ సినిమాను సైమల్టేనియస్ గా పూర్తిచేయబోతున్నాడు ప్రబాస్. ఆదిపురుష్ ఓ షెడ్యూల్ పూర్తయిన తర్వాత NagAshwin-Prabhas మూవీ స్టార్ట్ అవుతుంది.