#Akhil5 - కొత్త ప్రచారం!

Thursday,September 10,2020 - 01:49 by Z_CLU

Akkineni Akhil తో సురేందర్ రెడ్డి #Akhil5 సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే… ఇటివలే ఎనౌన్స్ అయిన ఈ సినిమాకు సంబంధించి స్టోరీ ఇదేనంటూ ప్రచారం జరుగుతుంది. మొన్నటి వరకు అఖిల్ తో Surender Reddy ఓ మాంచి లవ్ ఎంటర్టైనర్ తీస్తారనే టాక్ వినిపించగా ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కే సినిమా స్పై థ్రిల్లర్ అంటూ న్యూస్ స్ప్రెడ్ అవుతుంది.

వక్కంతం వంశీ Spy Thriller కథను రెడీ చేసాడని, సినిమాలో అఖిల్ స్పై గా కనిపిస్తాడని అంటున్నారు. అయితే ఈ విషయంపై మేకర్స్ నుండి క్లారిటీ వచ్చే వరకు ఇది ఏ జోనర్ సినిమా అనేది చెప్పలేం. ఒకవేళ ప్రచారంలో ఉన్నట్టు ఇది స్పై థ్రిల్లర్ అయితే గనుక అక్కినేని ఫాన్స్ కి పండగే. ఎందుకంటే అఖిల్ కి అలాంటి కథలు సెట్ అవుతాయని వాళ్ళ నమ్మకం. చూడాలి మరి అఖిల్ ఎలాంటి కథతో వస్తాడో ? ఎలా కనిపిస్తాడో?