స్టయిలిష్ వకీల్ సాబ్

Monday,March 02,2020 - 05:19 by Z_CLU

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మూవీ టైటిల్ వచ్చేసింది. అందరూ ఎక్స్ పెక్ట్ చేసినట్టుగానే ఈ సినిమాకు వకీల్ సాబ్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. అయితే అందరూ పండగ చేసుకుంటోంది టైటిల్ వచ్చినందుకు కాదు, ఈ టైటిల్ పెడతారని అందరికీ ముందే తెలుసు. ఫిలింఛాంబర్ లో చాన్నాళ్ల కిందటే టైటిల్ రిజిస్టర్ అయింది. టైటిల్ తో పాటు రిలీజ్ చేసిన పవన్ ఫస్ట్ లుక్ అందర్నీ ఎట్రాక్ట్ చేస్తోంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే కిర్రాక్ ఉంది ఫస్ట్ లుక్.

 

ఓ టెంపోలో సామాన్లు వేసుకొని, వాటిపై దర్జాగా కూర్చొని పుస్తకం చదువుతున్న పవన్ ఫొటోను ఫస్ట్ లుక్ కింద విడుదల చేశారు. ఈ లుక్ అదిరిపోయింది. కాస్త సీరియస్ సబ్జెక్ట్ (పింక్ రీమేక్)తో వస్తున్న ఈ సినిమాకు సంబంధించి పవన్ లుక్ ను కూడా సీరియస్ మూడ్ తో రిలీజ్ చేస్తారని అంతా అనుకున్నారు.

కానీ పవన్ తన స్టయిల్ మిస్ అవ్వలేదు. రీమేక్ అయినప్పటికీ తన మార్క్ చూపించాడు. ఫస్ట్ లుక్ లో అది క్లియర్ గా కనిపించింది. దిల్ రాజు బ్యానర్ పై వేణుశ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న వకీల్ సాబ్ సినిమాకు సంబంధించి త్వరలోనే ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయబోతున్నారు. తమన్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు.