Vakeel Saab Graffiti Painting - పవర్ స్టార్ ఫ్యాన్స్ కు జీ తెలుగు కానుక

Sunday,July 18,2021 - 12:18 by Z_CLU

మరికొన్ని గంటల్లో మోస్ట్ ఎవెయిటింగ్ మూవీ వకీల్ సాబ్, జీ తెలుగులో గ్రాండ్ గా ప్రసారం కాబోతోంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కమ్-బ్యాక్ మూవీని ఈరోజు సాయంత్రం 6 గంటలకు జీ తెలుగులో చూసి ఎంజాయ్ చేయండి. ఈ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ సందర్భంగా పవర్ స్టార్ ఫ్యాన్స్ కు జీ తెలుగు ఛానెల్ అదిరిపోయే కానుక అందించింది.

పవన్ ఫ్యాన్స్ కోసం వకీల్ సాబ్ భారీ గ్రాఫిటీ పెయింటింగ్ ను డిజైన్ చేసి రిలీజ్ చేసింది జీ తెలుగు. అన్నపూర్ణ స్టుడియోస్, నెక్లెస్ రోడ్ దగ్గర ఏర్పాటుచేసిన ఈ భారీ గ్రాఫిటీ పెయింటిగ్స్ అందర్నీ విపరీతంగా ఎట్రాక్ట్ చేస్తున్నాయి. అంతేకాదు.. దీనికి సంబంధించిన స్టిల్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఆ గ్రాఫిటీ పెయింటింగ్ మేకింగ్ వీడియోను జీ తెలుగు ఛానెల్ సగర్వంగా విడుదల చేసింది.