Vakeel Saab Zee Telugu - మరో ప్రతిష్టాత్మక అవార్డ్

Wednesday,March 16,2022 - 08:38 by Z_CLU

ZEE Telugu has bagged a BRONZE for Experiential Marketing for Vakeel Saab World Television Premiere Marketing Campaign

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ సినిమాకు సంబంధించి జీ తెలుగు ఛానెల్ మరో ప్రతిష్టాత్మక అవార్డ్ అందుకుంది. ఈ సినిమా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కు సంబంధించి E4M ఇండియన్ మార్కెటింగ్ అవార్డ్స్ లో ఎక్స్ పీరియన్సల్ మార్కెటింగ్ కేటగిరీలో బ్రాంజ్ అవార్డ్ అందుకుంది జీ తెలుగు.

వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కింద వకీల్ సాబ్ ను ప్రసారం చేయడం కోసం జీ తెలుగు సంస్థ వినూత్న మార్కెటింగ్ స్ట్రాటజీలను ఫాలో అయింది. వీటిలో ఒకటి గ్రాఫిటీ పెయిటింగ్. అన్నపూర్ణ స్టుడియోస్, నెక్లెస్ రోడ్ దగ్గర ఏర్పాటుచేసిన ఈ భారీ గ్రాఫిటీ పెయింటిగ్స్ అప్పట్లో అందర్నీ విపరీతంగా ఎట్రాక్ట్ చేశాయి. అంతేకాదు.. దీనికి సంబంధించిన స్టిల్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వీటితో పాటు మరిన్ని రకాలుగా ఈ సినిమాకు ప్రచారం కల్పించింది.

అలా వినూత్న ప్రచారం మధ్య గతేడాది జులై 18న వకీల్ సాబ్ సినిమాను వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రసారం చేసింది జీ తెలుగు. ఆ సినిమాకు రికార్డ్ బ్రేకింగ్ టీఆర్పీలు వచ్చాయి. పవన్ కెరీర్ లోనే హయ్యస్ట్ టీఆర్పీలు అందుకున్న సినిమాల్లో ఒకటిగా వకీల్ సాబ్ నిలిచింది. జీ తెలుగు నిర్వహించిన వినూత్న, అనుభవపూర్వక ప్రచారం వల్లనే ఇదంతా సాధ్యమైంది.

వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాలో పవన్ సరసన శృతిహాసన్ హీరోయిన్ గా నటించింది. అంజలి, అనన్య, నివేత థామస్ కీలక పాత్రలు పోషించారు. తమన్ సంగీతం ఈ సినిమాను నెక్ట్స్ లెవెల్లో నిలబెట్టింది. పవన్ కెరీర్ లో ది బెస్ట్ మూవీస్ లో ఒకటిగా నిలిచిపోయింది వకీల్ సాబ్. పవర్ స్టార్ రీఎంట్రీ మూవీ ఇది.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics