హిట్ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్

Monday,March 02,2020 - 01:25 by Z_CLU

నాని నిర్మాతగా విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కిన హిట్ సినిమా ఫస్ట్ వీకెండ్ మెరిసింది. మినిమం బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాకు మొదటి వారాంతం 3 కోట్ల 17 లక్షల రూపాయల షేర్ వచ్చింది. మూవీ ప్రీ-రిలీజ్ బిజినెస్ తో పోల్చుకుంటే దాదాపు 80శాతం రికవర్ అయింది “హిట్”.

సినిమాకు మొదటి రోజు హిట్ టాక్ వచ్చినప్పటికీ అది మల్టీప్లెక్సులకే పరిమితమైంది. బి, సి సెంటర్లలో ఈ సినిమాకు కలెక్షన్లు తగ్గాయి. మరో 4 రోజుల్లో ఈ సినిమా బ్రేక్ -ఈవెన్ అయ్యే అవకాశాలున్నాయి.

శైలేష్ కొలను డైరక్ట్ చేసిన ఈ సినిమా రీసెంట్ టైమ్స్ లో బెస్ట్ థ్రిల్లర్ అనిపించుకుంది. రుహానీ శర్మ హీరోయిన్ గా నటించింది.

ఏపీ, నైజాం 3 రోజుల షేర్
నైజాం – రూ. 1.60 కోట్లు
సీడెడ్ – రూ. 0.30 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 0.34 కోట్లు
ఈస్ట్ – రూ. 0.15 కోట్లు
వెస్ట్ – రూ. 0.18 కోట్లు
గుంటూరు – రూ. 0.25 కోట్లు
నెల్లూరు – రూ. 9 లక్షలు
కృష్ణా – రూ. 0.26 కోట్లు