Pawan Kalyan - అన్నీ దసరా తర్వాతే

Tuesday,October 13,2020 - 06:33 by Z_CLU

తన కొత్త సినిమాలకు సంబంధించి పవర్ స్టార్ డేట్స్ కేటాయించాడు. దసరా తర్వాత సెట్స్ పైకి వెళ్లడానికి అంగీకరించాడు. సో.. వకీల్ సాబ్ లాస్ట్ షెడ్యూల్ అక్టోబర్ లాస్ట్ వీక్ నుంచి స్టార్ట్ అవుతుంది.

Vakeel Saab సినిమాకు సంబంధించి పవన్ కల్యాణ్ పోర్షన్ మాత్రం పెండింగ్ లో ఉంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే డిసెంబర్ మొదటి వారానికి షూట్ మొత్తం కంప్లీట్ అవుతుంది. హీరోయిన్ శృతిహాసన్ కూడా నవంబర్ నుంచి సెట్స్ పైకి రావడానికి ఒప్పుకుంది.

వకీల్ సాబ్ పూర్తయిన తర్వాత క్రిష్ సినిమాకు, హరీష్ శంకర్ సినిమాకు డేట్స్ కేటాయించాడు Pawan Kalyan.

సంక్రాంతి బరిలో వకీల్ సాబ్ ను దించాలని ప్లాన్ చేస్తున్నాడు నిర్మాత దిల్ రాజు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా, పవన్ కు రీఎంట్రీ మూవీ.

Also Read – వకీల్ సాబ్ Vs కేజీఎఫ్2