వకీల్ సాబ్ Vs KGF2

Wednesday,October 07,2020 - 10:14 by Z_CLU

వచ్చే సంక్రాంతికి కొన్ని మినిమం రేంజ్ హీరోల సినిమాలు బెర్త్ కన్ఫర్మ్ చేసుకున్నాయి. అయితే మరికొన్ని రోజుల్లో Vakeel Saab నుండి ఓ కీలక ప్రకటన రాబోతుందని తెలుస్తుంది. అవును.. Power Star రెండేళ్ళ గ్యాప్ తర్వాత నటిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. ఈ విషయాన్ని టైం చూసుకొని ప్రకటించనున్నారు.

అయితే ఇప్పటికే KGF2 సంక్రాంతి విడుదల అంటూ ఎనౌన్స్ చేసారు మేకర్స్. అంటే వచ్చే సంక్రాంతి వకీల్ సాబ్ మరియు కేజీఎఫ్ 2 సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పోటీ పడబోతున్నాయన్న మాట. ఇదే నిజమైతే ఈ రెండు బడా సినిమాలలో ఏది భారీ వసూళ్లు రాబట్టి సంక్రాంతి విన్నర్ గా నిలుస్తుందో చూడాలని వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్.