Kajal Marriage - చందమామ పెళ్లి వేదిక ఫిక్స్

Tuesday,October 13,2020 - 04:57 by Z_CLU

స్టార్స్ పెళ్లిళ్లన్నీ ఆర్భాటంగా జరుగుతాయి. కొంతమంది డెస్టినేషన్ వెడ్డింగ్ పేరిట విదేశాలకు వెళ్లి పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. మరికొందరు లోకల్ గానే స్టార్ హోటల్ లో గ్రాండ్ గా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. మరి Kajal Wedding ఎక్కడ?

హీరోయిన్ కాజల్ మాత్రం తన పెళ్లిని సింపుల్ గా తన ఇంట్లోనే చేసుకుంటోంది. అవును.. ముంబయిలో ఉంటున్న కాజల్ ఎలాంటి స్టార్ హోటల్ బుక్ చేయలేదు. రీసెంట్ గా రీమోడలింగ్ చేసిన తన ఇంట్లోనే పెళ్లికి ఏర్పాట్లు చేసుకుంటోంది.

ఈ కరోనా టైమ్ లో డెస్టినేషన్ వెడ్డింగ్, స్టార్ హోటల్ మ్యారేజ్ లాంటివి పెట్టుకోకుండా.. ఇంట్లోనే పెళ్లి చేసుకోవడం సేఫ్ అని భావించింది Kajal.

ముంబయికి చెందిన గౌతమ్ కిచ్లుతో రెండేళ్లుగా డేటింగ్ లో ఉంది కాజల్. ఆగస్ట్ లో వీళ్లిద్దరు ఎంగేజ్ మెంట్ చేసుకున్నారు. ఈనెల 30న పెళ్లికి ఒకటి కాబోతున్నారు.

Also Read – బ్యాచిలర్ పార్టీ ఇచ్చిన కాజల్