ఇకపై శరవేగంగా పవన్ సినిమా

Friday,August 05,2016 - 10:56 by Z_CLU

సాధారణంగా పవన్ కల్యాణ్ సినిమా షూటింగ్ నిదానంగా జరుగుతుంది. స్క్రీన్ ప్లే మొత్తం పూర్తయిన తర్వాతే సెట్స్ పైకి వెళ్లడం పవన్ కు అలవాటు. కడప కింగ్ విషయంలో కూడా ఆలస్యానికి అదే కారణం. ఎస్ జే సూర్య తప్పుకున్న తర్వాత… డాలీకి దర్శకత్వ బాధ్యతలు అప్పగించడం… స్క్రీన్ ప్లేలో మార్పుల వల్ల ఇన్నాళ్లూ ప్రాజెక్ట్ సెట్స్ పైకి రావడం కాస్త ఆలస్యమైంది. అయితే ఒకసారి సెట్స్ పైకి వచ్చిన తర్వాత మాత్రం సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకోనుంది. దీనికి సంబంధించి పవన్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నాడు.

రేపట్నుంచి (శనివారం) పవన్ సినిమా షూటింగ్ మొదలవుతుంది. ఈ సినిమా కోసం పవన్ కాస్త ఎక్స్ ట్రా టైం కాల్షీట్ కేటాయిస్తున్నాడు. సినిమాను వీలైనంత తొందరగా పూర్తిచేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఎక్స్ ట్రా టైం కాల్షీట్ వల్ల…. రోజులో ఒకటి కంటే ఎక్కువ సన్నివేశాల్ని తెరకెక్కించడానికి వీలవుతుంది. సో… ఈసారి పవన్ సినిమా అనుకున్న సమయానికి రావడం ఖాయం.