ఆగస్టు 12 న 'జనతా గ్యారేజ్' ఆడియో

Thursday,August 04,2016 - 06:20 by Z_CLU

 

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్…. కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న తాజా చిత్రం ‘జనతా గ్యారేజ్’. ఈ చిత్ర ఆడియో వేడుకను ఈ నెల 12న ఘనంగా జరపడానికి సన్నాహాలు చేస్తున్నారు చిత్ర నిర్మాతలు. మొదట తిరుపతి, వైజాగ్ లో వేడుక చెయ్యాలని ప్లాన్ చేసిన యూనిట్…. ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఈ వేడుక ను జరపడానికి నిశ్చయించినట్లు సమాచారం. ఈ చిత్రానికి దేవి శ్రీ సంగీతం అందించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పటికే కొరటాల శివకు రెండు సూపర్ హిట్ ఆల్బమ్స్ అందించిన దేవి ఈ చిత్రానికి కూడా అదే రేంజ్ ఆడియోను అందించారని టాక్. అంతే కాదు ఈ సినిమాకు సంబంధించిన కొన్ని సన్నివేశాలకు దేవి అదిరిపోయే బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చినట్టు యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. దేవి శ్రీ అందించిన పాటలకు తారక్ ఎనర్జీ సెప్పులు మాస్ ఆడియోన్స్ చేత విజిల్స్ వేయిస్తాయట.