పవన్ కల్యాణ్ కు ఆ సినిమాతో సంబంధం ఏంటి..?

Monday,October 31,2016 - 04:19 by Z_CLU

ఇండస్ట్రీలో కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చి కొద్ది కాలమే అయినా సప్తగిరి సిల్వర్ స్క్రీన్ పై తనకంటూ స్పెషల్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు. తన నెక్స్ట్ చిత్రం సప్తగిరి ఎక్స్ ప్రెస్ గనక హిట్టయితే ఇక టాలీవుడ్ కి ఇంకో కామెడీ హీరో దొరికినట్టే. ఇవన్నీ పక్కన పెడితే నవంబర్ 6 న ఆడియో రిలీజ్ జరుపుకోనున్న సప్తగిరి ఎక్స్ ప్రెస్ లో పవర్ ఫుల్ ఎలిమెంట్ ఒకటి చోటు చేసుకోనుంది.

సప్తగిరి ఎక్స్ ప్రెస్ కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అటెండ్ అవుతున్నాడని ఇన్ సైడ్ సోర్సెస్ ద్వారా సమాచారం. సప్తగిరి సినిమాకి అంత బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ అటెండ్ అవ్వడమేంటబ్బా అని ఆరా తీస్తే, ఈ సినిమాకి ముందు ‘కాటమ రాయుడు’ అని టైటిల్ ని ఫిక్స్ చేసుకుందట సినిమా యూనిట్. ఈ లోపు పవన్ కళ్యాణ్ టైటిల్ విషయంలో జోక్యం చేసుకునేసరికి ఆ ఆలోచన మానుకుని ‘సప్తగిరి ఎక్స్ ప్రెస్’ అని చేంజ్ చేసుకున్నారు.

saptagiri-express-movie-motion-poster-released-comedian-saptagiri

ఆ ప్రాసెస్ లోనే “సప్తగిరి ఎక్స్ ప్రెస్” సినిమా ఆడియో ఫంక్షన్ కి గెస్ట్ గా వస్తానని ప్రామిస్ చేశాడట పవన్ కళ్యాణ్. అసలే ఊపిరాడనంత బిజీ షెడ్యూల్స్ లో ఉన్న పవర్ స్టార్ తన ప్రామిస్ ని నిలబెట్టుకుంటాడో లేదో చూడాలి.