సునీల్ కి పోటీగా మరో ఇద్దరు

Monday,October 31,2016 - 04:06 by Z_CLU

కమెడియన్ గా తెలుగు తెరకు పరిచయమైన సునీల్ తన ట్యాలెంట్ తో లీడ్ హీరో స్థానానికి రీచ్ అయ్యాడు. పూర్తి స్థాయి హీరోలా నటించినా తన మార్క్ కామెడీని మాత్రం వదులుకోలేదు. తను నటించే సినిమా సబ్జెక్ట్ ఏదైనా కామెడీ మాత్రం కంపల్సరీగా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాడు.

ఇండస్ట్రీలో ఓ రేంజ్ స్టార్ డమ్ ఉన్న హీరోల సంగతి కాస్త పక్కన పెడితే సునీల్ రూటు కాస్తంత సెపరేటు. సినిమా బిగినింగ్ నుండి ఎండింగ్ వరకు నవ్విస్తూనే కథను నడిపిస్తుంటాడు. అయితే ఈ సెపరేట్ రూటులో మరో ఇద్దరు కమెడియన్లు జాయిన్ అయ్యారు. వీరి స్పీడ్ చూస్తుంటే సునీల్ కి గట్టి పోటీ ఇచ్చేలా ఉన్నారు.

collage2

నిన్నటి వరకు కామెడీ క్యారెక్టర్స్ చేస్తూ నవ్వించిన శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి కూడా ఫుల్ ఫ్లెడ్జ్ హీరోల్లా దూసుకుపోయే పనిలో పడ్డారు. గీతాంజలి సినిమాలో హీరోగా నటించిన శ్రీనివాస్ రెడ్డి ఇప్పుడు ‘జయమ్ము నిశ్చయమ్మురా’ నటిస్తున్నాడు. ఈ సినిమాలో పూర్ణ హీరోయిన్ గా నటిస్తుంది. మరో వైపు సప్తగిరి కూడా ‘సప్తగిరి ఎక్స్ ప్రెస్’ తో ఫాస్ట్ ఫాస్ట్ గా దూసుకొస్తున్నాడు. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ అవ్వాలి కానీ వీరిద్దరూ కామెడీ హీరోలు సెటిల్ అవ్వడం ఖాయం.