“భరత్ అనే నేను”

Monday,October 31,2016 - 04:24 by Z_CLU

కొరటాల తన నెక్స్ట్ సినిమాకి టైటిల్ ఫిక్స్ చేసేశాడు. అటు మహేష్ బాబు మురుగదాస్ డైరెక్షన్ లో బిజీగా ఉండగానే మరోవైపు కొరటాల ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ లో బిజీ అయిపోయాడు. ఈ లోపు పవర్ ఫుల్ ఫైర్ వర్క్ లాంటి టైటిల్ కూడా ఫిక్స్ చేశాడట కొరటాల.

“భరత్ అనే నేను”  అనే టైటిల్ ని మహేష్ కొత్త సినిమాకు ఫిక్స్ చేశాడట కొరటాల. ఈ సినిమాకి సంబంధించి స్క్రిప్ట్ వర్క్ పై ఇప్పటికే భారీగా కసరత్తు చేస్తున్నాడు. ఇప్పటి వరకు సినిమా యూనిట్ నుంచి టైటిల్ పై అఫీషియల్ గా ఎటువంటి అనౌన్స్ మెంట్ రాలేదు కానీ… అంతలోనే ఈ సినిమాలో మహేష్ బాబు చీఫ్ మినిస్టర్ గా నటిస్తున్నాడనే రూమర్ నడుస్తోంది. కొరటాల తన గత సినిమాల్లో లాగే ఒక మెసేజ్ ఇస్తూనే, పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్ తో సినిమాని ప్లాన్ చేస్తున్నాడని ఫిలిం నగర్ టాక్.