హాట్ టాపిక్: ఆచార్యలో మరో కీలక పాత్ర..?

Friday,March 20,2020 - 01:45 by Z_CLU

ఆచార్యలో హీరోయిన్ గా కాజల్ ను తీసుకున్నారు. దాదాపు ఇది ఫిక్స్. అయితే ఈ సినిమాలో కాజల్ తో పాటు మరో కీ-రోల్ కూడా ఉంది. ఇప్పుడా క్యారెక్టర్ కోసం ఎవర్ని తీసుకోవాలనే అంశంపై యూనిట్ లో డిస్కషన్ స్టార్ట్ అయింది.

ఈ ఫిమేల్ కీరోల్ కోసం కియరాను తీసుకుందామనేది రామ్ చరణ్ ప్రతిపాదన. రష్మిక అయితే బాగుంటుందనేది చిరంజీవి ప్రపోజల్. దాదాపు 3 నిమిషాల రన్ టైమ్ ఉన్న ఈ క్యారెక్టర్ కు ఎవర్ని ఫిక్స్ చేస్తారనేది త్వరలోనే తెలుస్తుంది.

ఆచార్యలో కీలక పాత్ర అనేగానే ఎవరికైనా మహేష్ బాబు పేరే గుర్తొస్తుంది. దాదాపు 20 నిమిషాల నిడివి ఉండే ఆ పాత్రను మహేష్ తో చేయించాలనుకున్నారు. కానీ ఆఖరి నిమిషంలో నిర్ణయం మారింది. ఇంతకుముందు అనుకున్న విధంగా రామ్ చరణ్ తోనే ఆ పాత్ర చేయించాలని మెగాస్టార్ డిసైడ్ అయ్యారు. ఇప్పుడు మరో ఫిమేల్ కీరోల్ కోసం రష్మిక-కియరా పేర్లను పరిశీలిస్తున్నారు.

ప్రస్తుతం కరోనా కారణంగా సినిమా షూటింగ్ ను ఆపేశారు. ఈ గ్యాప్ లో రామ్ చరణ్ కాల్షీట్లను లాక్ చేయడంతో పాటు.. రష్మిక, కియరాలో ఒకర్ని ఫిక్స్ చేస్తారు.