ఉగాదికి ప్రభాస్ కొత్త సినిమా టైటిల్

Friday,March 20,2020 - 01:21 by Z_CLU

ప్రభాస్ కొత్త సినిమా టైటిల్ ను ఉగాదికి (25న) ఎనౌన్స్ చేయబోతున్నారు. అయితే అంతా అనుకుంటున్నట్టు ఇది రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా టైటిల్ కాదు. నాగఅశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ చేయబోయే కొత్త సినిమా టైటిల్ ను ఉగాదికి ఎనౌన్స్ చేయబోతున్నారు. ఈ మేరకు వైజయంతీ మూవీస్ బ్యానర్ నుంచి అఫీషియల్ స్టేట్ మెంట్ వచ్చేసింది.

రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న సినిమాకు ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు. ఈ సినిమాకు రాథేశ్యామ్ లేదా ఓ డియర్ అనే టైటిల్ అనుకుంటున్నారు. ఈ కన్ఫర్మేషన్ రాకముందే.. ప్రభాస్-నాగఅశ్విన్ మూవీ టైటిల్ ను ప్రకటించబోతున్నారు.

సైన్స్ ఫిక్షన్ కాన్సెప్ట్ తో రాబోతోంది ప్రభాస్-నాగఅశ్విన్ సినిమా. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అత్యంత భారీ బడ్జెట్ తో రాబోతున్న ఈ సినిమాను పాన్-వరల్డ్ మూవీగా ప్లాన్ చేస్తున్నట్టు నాగఅశ్విన్ ఇప్పటికే ప్రకటించాడు.