"రెడ్"లో హెబ్బా పటేల్ మెరుపులు

Friday,March 20,2020 - 02:22 by Z_CLU

ఈమధ్య సినిమాల్లో హీరోయిన్ క్యారెక్టర్స్ కంటే మెరుపు పాత్రలే ఎక్కువగా చేస్తోంది హెబ్బా పటేల్. అంటే గెస్ట్ రోల్స్ అన్నమాట. త్వరలోనే రిలీజ్ కాబోతున్న రెడ్ సినిమాలో కూడా హెబ్బా పటేల్ ఉంది. ఆమెపై రామోజీ ఫిలింసిటీలో తీసిన ఓ స్పెషల్ సాంగ్ సినిమాకే హైలెట్ అంటోంది యూనిట్.

రామ్ హీరోగా నటిస్తున్న రెడ్ లో ఆల్రెడీ ముగ్గురు హీరోయిన్లున్నారు. నివేత పెతురాజ్, మాళవిక శర్మ, అమృత అయ్యర్ హీరోయిన్లుగా నటించారు. ఇప్పుడు వీళ్లకు అదనంగా హెబ్బా పటేల్ తో మంచి స్పైసీ సాంగ్ పెట్టారట రెడ్ సినిమాలో. హెబ్బాపై కొన్ని సన్నివేశాలు కూడా ఉన్నాయంటున్నారు.

రీసెంట్ గా వచ్చిన భీష్మ సినిమాలో ఓ స్పెషల్ రోల్ చేసింది హెబ్బా పటేల్. రిలీజ్ కు రెడీ అయిన ఒరేయ్ బుజ్జిగా సినిమాలో కూడా హెబ్బా ప్రత్యేక పాత్ర పోషించింది. ఇప్పుడు రెడ్ మూవీతో మరోసారి ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేయబోతోంది.