Acharya రేపటి నుండి మెగా హంగామా !

Monday,April 11,2022 - 04:50 by Z_CLU

MegaStar Chiranjeevi’s ‘Acharya’ hungama starts from tomorrow

మెగాస్టార్ సినిమా వస్తుందంటే ఇటు ఇండస్ట్రీలో అటు ఆడియన్స్ లో మెగా బజ్ నెలకొంటుంది.  ఆ క్రేజ్ కి మెగా పవర్ స్టార్ కూడా యాడ్ అయితే ఇక సినిమాపై భారీ అంచనాలు ఏర్పడటం కామన్. ఇప్పుడు ‘ఆచార్య’ చుట్టూ అలాంటి భారీ బజ్ స్టార్టయింది. రేపటి నుండి ‘ఆచార్య’ మెగా హంగామా మొదలు కానుంది. ఇప్పటికే టీజర్ , సాంగ్స్ తో హైప్ క్రియేట్ చేసిన చిరు , చరణ్ రేపు రిలీజ్ అయ్యే ట్రైలర్ తో ఆ ఎక్స్ పెక్టేషన్స్ ని మరో లెవెల్ కి తీసుకెళ్లేందుకు రెడీ అవుతున్నారు.

ఏప్రిల్ 12న 5 గంటల 49 నిమిషాలకు కొన్ని థియేటర్స్ లో ట్రైలర్ రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే మెగా ఫ్యాన్స్ కి ఇన్ఫర్మేషన్ ఇస్తూ థియేటర్స్ లిస్టు కూడా చెప్పేశారు మేకర్స్. అలాగే 20న ఆల్బంలోని మరో సాంగ్ ని రిలీజ్ చేయనున్నారని తెలుస్తుంది. 23న భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఉండనుందని టాక్. ఇలా ప్రమోషన్స్ కి సంబంధించి ఒకదాని తర్వాత్ మరొకటి భారీగా ప్లాన్ చేస్తూ ముందుకు వెళ్తోంది ఆచార్య టీం.

కొరటాల శివ డైరెక్షన్ లో మెగా స్టార్ చిరంజీవి , మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో కాజల్ , పూజ హెగ్డే హీరోయిన్స్ గా నటించారు. భారీ అంచనాల నడుమ ఏప్రిల్ 29న సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

 

Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics