#Acharya - రిలీజ్ డేట్ ఫిక్స్ ?

Saturday,July 10,2021 - 05:26 by Z_CLU

మెగాస్టార్ చిరంజీవి, కొరటాల కాంబినేషన్ లో రూపొందుతున్న ‘ఆచార్య’ సినిమాకు సంబంధించి రిలీజ్ డేట్ ఫైనల్ చేసే సన్నాహాల్లో ఉన్నారు మేకర్స్. సెప్టెంబర్ లో వినాయక చవితి కానుకగా సినిమాను విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం సినిమాకు సంబంధించి కొన్ని సన్నివేశాలు ఒక సాంగ్ మినహా షూట్ దాదాపు పూర్తయింది. బ్యాలెన్స్ షూట్ తాజాగా మొదలు పెట్టి వీలైనంత త్వరగా ఫినిష్ చేసే పనిలో ఉన్నారు కొరటాల శివ.

ప్రస్తుతం కోకాపేట్ లో వేసిన భారీ సెట్లోనే ఆచార్య ఫైనల్ షెడ్యుల్ జరుగుతుంది. రామ్ చరణ్, సోనూ సూద్ లపై ఓ యాక్షన్ ఎపిసోడ్ ను షూట్ చేస్తున్నారు యూనిట్. తర్వాత చిరుపై కొన్ని సీన్స్ తీస్తారు. అలాగే షూట్ చేస్తూ సాంగ్ ని కూడా కంప్లీట్ చేయనున్నారు. ఈ నెలాఖరు కల్లా టోటల్ షూట్ ఫినిష్ చేసి కొత్త రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేసే ప్లానింగ్ ఉన్నారు. ఈ లోపు ఆగస్ట్ అంతా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ప్రమోషన్ పై దృష్టి పెట్టి సినిమాను రిలీజ్ కి రెడీ చేస్తారు.

acharya movie ramcharan

                    ఆచార్యలో రామ్ చరణ్

మ్యాట్నీ ఎంటర్టైన్ మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో కాజల్పూజా హెగ్డే హీరోయిన్స్ నటిస్తున్నారు. మణిశర్మ ఈ సినిమాకు మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు. త్వరలోనే ఆల్బం నుండి రెండో సింగిల్ రానుంది. దానికి సంబంధించి అప్డేట్ అతి త్వరలోనే రాబోతుంది. మరి లాహే లాహే సాంగ్ తో మిలియన్ వ్యూస్ అందుకున్న మెగాస్టార్ చిరు రెండో సింగిల్ తో ఇంకెన్ని మిలియన్ వ్యూస్ కొల్లగోడతారో చూడాలి.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics