ప్రభాస్ ఖాతాలో మరో బాలీవుడ్ దర్శకుడు

Thursday,May 11,2017 - 10:49 by Z_CLU

బాహుబలి-2తో జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రభాస్. ఈ హీరోతో సినిమా చేసేందుకు చాలామంది బాలీవుడ్ ప్రముఖులు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. బాహుబలి ఫ్రాంచైజీని బాలీవుడ్ లో ప్రజెంట్ చేసిన కరణ్ జోహార్.. ప్రభాస్ తో 2 సినిమాల డీల్ కుదుర్చుకున్నాడని ఇప్పటికే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇప్పుడీ లిస్ట్ లోకి సూపర్ హిట్ దర్శకుడు రోహిత్ షెట్టి కూడా ఎంటరయ్యాడు.

గతంలో షారూక్ తో చెన్నై ఎక్స్ ప్రెస్ లాంటి సూపర్ హిట్ సినిమాను తెరకెక్కించిన రోహిత్ షెట్టి.. ప్రభాస్ తో ఓ మూవీ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడట. ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఉన్న ఈ దర్శకుడు.. గోల్ మాల్ రిటర్న్స్ అనే సినిమాను డైరక్ట్ చేస్తున్నాడు. ఈ మూవీ తర్వాత వీలైతే ప్రభాస్ తో తెలుగు-తమిళ-హిందీ భాషల్లో ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడట.

ప్రస్తుతానికైతే అటు కరణ్ జోహార్, ఇటు రోహిత్ షెట్టి ఎవరూ ప్రభాస్ ను కలవలేదు. నిజానికి ప్రభాస్ హైదరాబాద్ లో లేడు. అమెరికాలో రిలాక్స్ అవుతున్నాడు. యంగ్ రెబల్ స్టార్ అమెరికా నుంచి తిరిగొచ్చిన తర్వాత బాలీవుడ్ ప్రాజెక్టుపై ఓ క్లారిటీ వస్తుంది.