రాజ్ తరుణ్ “అంధగాడు” విడుదల వాయిదా

Thursday,May 11,2017 - 11:03 by Z_CLU

లెక్క ప్రకారం.. ఈనెల 26న విడుదలవ్వాలి అంధగాడు మూవీ. కానీ ఈ సినిమాను మరో వారం రోజుల పాటు వాయిదావేశారు. అంధగాడు సినిమాకు కొత్త రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేశారు. రాజ్ తరుణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన పోస్టర్లలో “జూన్ 2 రిలీజ్” అని ప్రింట్ చేశారు.

ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కిన అంధగాడు సినిమాలో రాజ్ తరుణ్ సరసన హెబ్బా పటేల్ హీరోయిన్ గా నటించింది. ప్రముఖ రచయిత వెలిగొండ శ్రీనివాస్, ఈ సినిమాత దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీకి సంబంధించి ఇప్పటికే సాంగ్స్ రిలీజ్ చేసే ప్రాసెస్ ప్రారంభమైంది.

ఈ సినిమాలో రాజ్ తరుణ్ అంధుడిగా కనిపించబోతున్నాడు. అయితే ఇది ఆర్ట్ ఫిలిం కాదు. ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ ఎఁటర్ టైనర్. తాజాగా రిలీజైన టీజర్ చూస్తే ఈ విషయం ఈజీగా అర్థమైపోతుంది. త్వరలోనే మిగిలిన పాటల్ని సోషల్ మీడియాలో రిలీజ్ చేసి, ప్రీ-రిలీజ్ ఫంక్షన్ పెట్టి.. సినిమాను థియేటర్లలోకి తీసుకురావాలని అనుకుంటున్నారు.