హాట్ టాపిక్: ప్రభాస్, హృతిక్ మల్టీస్టారర్

Wednesday,July 08,2020 - 10:02 by Z_CLU

కొన్ని కాంబినేషన్ సినిమాలు ప్రేక్షకులను ఎట్రాక్ట్ చేస్తూ చర్చనీయాంశం అవుతుంటాయి. ప్రస్తుతం ఓ మల్టీ స్టారర్ సినిమా ప్రచారం అలాంటి చర్చే లేపింది. ప్రభాస్, హృతిక్ రోషన్ కలిసి ఓ ప్యాన్ ఇండియా మల్టీ స్టారర్ సినిమా చేయబోతున్నారని, దీన్ని ఓమ్ రావత్ డైరెక్ట్ చేస్తారని ప్రచారం జరుగుతుంది. దీంతో ఈ న్యూస్ వైరల్ అయింది.

బాహుబలి ప్రాంచైజీ తో ఇంటర్ నేషనల్ స్టార్ గా ఎదిగిన ప్రభాస్ మరియు మంచి ఫాలోయింగ్ ఉన్న హృతిక్ కలిసి ఒకే సినిమాలో కనిపిస్తారనే విషయం హాట్ టాపిక్ అవుతుంది.

ప్రస్తుతం రాధా కృష్ణ డైరెక్షన్ లో తన 20వ చేస్తున్న ప్రభాస్ తర్వాత నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో ప్యాన్ ఇండియా సినిమా చేయనున్నాడు. ఆ సినిమా తర్వాత రెబల్ స్టార్ బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తోనే సినిమా చేస్తాడని అంటున్నారు. ఈ విషయంలో నిజమెంత అనేది త్వరలోనే తెలియనుంది.