Prabhas Dhoom 4 - ఆ అవకాశం లేనట్టే!
Tuesday,June 22,2021 - 12:25 by Z_CLU
ధూమ్ ఫ్రాంచైజీ.. జాన్ అబ్రహాంకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిన సినిమా. ఇదే ఫ్రాంచైజీ హృతిక్ రోషన్ కు కూడా ఓ హిట్ అందించింది. ఇక ఈ సిరీస్ కు అమీర్ ఖాన్ ఏకంగా ఓ బ్రాండ్ ఇమేజ్ తెచ్చిపెట్టాడు. ఇప్పుడీ హీరోల సరసన చేరే అవకాశాన్ని ప్రభాస్ కోల్పోయాడు. ధూమ్-4లో ప్రభాస్ ఉండకపోవచ్చంటూ యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ నుంచి లీకులు వచ్చాయి. దీనికి ఓ కారణం కూడా ఉంది.

బాహుబలి-1, బాహుబలి-2, సాహో సినిమాలతో బాలీవుడ్ లో విపరీతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ప్రభాస్ ను.. వెంటనే ధూమ్-4లో స్ట్రయిట్ బాలీవుడ్ డెబ్యూ కింద పరిచయం చేస్తే బాగుంటుందని నిర్మాత ఆదిత్య చోప్రా భావించాడు. కానీ ప్రభాస్ మాత్రం ధూమ్-4 కంటే ముందే ఆదిపురుష్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ప్రభాస్ స్ట్రయిట్ హిందీ సినిమా ఇదే. దీంతో ధూమ్-4లో ప్రభాస్ ను తీసుకున్నప్పటికీ ఆ ఫ్రెష్ ఫీల్ ఉండదని భావించి ఆదిత్య చోప్రా తప్పుకున్నాడట.
ఆదిత్య చోప్రా తప్పుకున్నాడని చెప్పడం కంటే, ప్రభాస్ బిజీగా ఉన్నాడని చెప్పడం కరెక్ట్. ఎందుకంటే, ప్రభాస్ చేతిలో ప్రస్తుతం ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 4 సినిమాలున్నాయి. రాధేశ్యామ్ ఫైనల్ స్టేజ్ లో ఉంది. ఆదిపురుష్ సెట్స్ పై ఉంది. సలార్ సినిమా కూడా షూటింగ్ మోడ్ లో ఉంది. వీటిలో ఏదో ఒకటి పూర్తయిన వెంటనే నాగఅశ్విన్ సినిమా రెడీగా ఉంది. వీటి తర్వాత బాలీవుడ్ లోనే మరో స్ట్రయిట్ మూవీ ప్లాన్ చేస్తున్నాడు ప్రభాస్. ఒకవేళ అది మిస్సయితే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మరో సినిమా చేసే ప్లాన్స్ కూడా ఉన్నాయి. కాబట్టి ఇన్ని కమిట్ మెంట్స్ మధ్య ధూమ్-4 చేసే పరిస్థితి లేదు. కాకపోతే ఓ మంచి యాక్షన్ బ్యాక్ డ్రాప్ ఉన్న రోల్ మాత్రం మిస్సయ్యాడు ఈ హీరో.

‘రాధేశ్యామ్’లో ప్రభాస్
ఇక ప్రభాస్ ప్రస్తుత సినిమాల విషయానికొస్తే.. టాలీవుడ్ లో షూటింగ్స్ మొదలవ్వడంతో ప్రభాస్ కూడా రెడీ అవుతున్నాడు. ముందుగా రాధేశ్యామ్ సినిమా షూట్ ను పూర్తిచేయబోతున్నాడు. దీనికి సంబంధించి 4-5 రోజుల వర్క్ మాత్రమే పెండింగ్ ఉంది. 2 సీన్లు, ఓ సాంగ్ చేస్తే సినిమా పూర్తయిపోతుంది. ఈ నెలాఖరుకు ఈ సినిమా షెడ్యూల్ స్టార్ట్ చేస్తాడు ప్రభాస్. ఆ తర్వాత సలార్ సినిమా సెట్స్ పైకి షిఫ్ట్ అవుతాడు.
- – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics