హ్యాపీ బర్త్ డే రాజ్ తరుణ్

Thursday,May 11,2017 - 10:37 by Z_CLU

ఎప్పుడొచ్చామన్నది కాదు.. ఎంత కన్సిస్టెంట్ గా హిట్స్ ఇచ్చామన్నది ఇంపార్టెంట్. అలా షార్ట్ టైమ్ లోనే లాంగ్ వే నిర్మించుకున్నాడు హీరో రాజ్ తరుణ్. తను చేసే ప్రతి సినిమా మినిమం గ్యారెంటీ హిట్ అనిపించుకున్నాడు. జస్ట్ 4 ఏళ్ల కిందట ఎంట్రీ ఇచ్చిన ఈ హీరో, ఇప్పటివరకు 6 సినిమాలు చేశాడు. ఈరోజు తన పుట్టినరోజును గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్న ఈ హీరో అంధగాడు సినిమాతో అలరించడానికి రెడీ అవుతున్నాడు.

ఉయ్యాల జంపాల

రాజ్ తరుణ్ ను వెండితెరకు పరిచయం చేసిన సినిమా. ఈ సినిమాతోనే ఒక్కసారిగా బాయ్ నెక్ట్స్ డోర్ ఇమేజ్ అందుకున్నాడు రాజ్ తరుణ్. ఇప్పటికీ రాజ్ తరుణ్ ఏదో ఒక ఇమేజ్ కు ఫిక్స్ అయిపోకుండా ఆల్ రౌండర్ అనిపించుకుంటున్నాడంటే దానికి కారణం ఈ సినిమానే.

సినిమా చూపిస్త మామ

ఉయ్యాల జంపాల లాంటి బిగ్ హిట్ తర్వాత వచ్చిన సినిమా ఇది. ఏ హీరోకైనా రెండో సినిమా షాక్ ఇస్తుందనే నెగెటివ్ సెంటిమెంట్ ఇండస్ట్రీలో ఉంది. కానీ రాజ్ తరుణ్ మాత్రం తన సెకెండ్ వెంచర్ తో అద్భుతమైన విజయాన్నందుకున్నాడు. టాలీవుడ్ హీరోగా బెర్త్ కన్ ఫర్మ్ చేసుకున్నాడు. ఈ సినిమా తర్వాతే రాజ్ తరుణ్ కు ఫ్యాన్ బేస్ క్రియేట్ అయింది.

కుమారి 21 ఎఫ్

కెరీర్ లో చేసిన మూడో సినిమాతోనే విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు రాజ్ తరుణ్. స్టార్ డైరక్టర్ సుకుమార్ నిర్మాతగా మారి తన మొదటి సినిమాకు రాజ్ తరుణ్ ను హీరోగా సెలక్ట్ చేసుకున్నాడంటే.. అక్కడే సగం పాస్ అయిపోయాడు ఈ కుర్రాడు. తర్వాత సినిమా థియేటర్లలోకి రావడం, బ్రహ్మాండమైన విజయం సాధించడం చకచకా జరిగిపోయాయి.

ఈడో రకం ఆడో రకం

మంచు విష్ణుతో కలిసి చేసిన ఈ సినిమా కూడా సక్సెస్ అయింది. పక్కా కామెడీ ఎంటర్ టైనర్ గా పేరుతెచ్చుకుంది. ఈ మూవీతో రాజ్ తరుణ్ లోని కామెడీ యాంగిల్ చూశారు జనాలు.

కిట్టు ఉన్నాడు జాగ్రత్త

రాజ్ తరుణ రీసెంట్ రిలీజ్ ఇది. ఇందులో ఈ హీరో వన్ మేన్ షో కనిపిస్తుంది. సినిమాను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు తనే నడిపించి సెంటరాఫ్ ఎట్రాక్షన్ గా నిలిచాడు. ఈ సినిమా కూడా రాజ్ తరుణ్ కెరీర్ లో ఓ సక్సెస్ ఫుల్ సినిమాగా చేరిపోయింది.

ప్రస్తుతం ఈ హీరో అంధగాడు రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నాడు. జూన్ 2న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. ఈ మూవీతో మరో పెద్ద హిట్ పై కన్నేశాడు ఈ బర్త్ డే బాయ్. ఇలా చేసిన 6 సినిమాల్లో 5 సక్సెస్ లు అందుకొని రాకెట్ లా దూసుకుపోతున్నాడు రాజ్ తరుణ్.