ఏప్రిల్ 12 నుండి సెట్స్ పైకి ఎన్టీఆర్, త్రివిక్రమ్ మూవీ?

Tuesday,March 20,2018 - 03:28 by Z_CLU

త్రివిక్రమ్ డైరెక్షన్ లో తెరకెక్కనున్న NTR సినిమా ప్రీ ప్రొడక్షన్ కి ఆల్మోస్ట్ ప్యాకప్ చెప్పేసినట్లే అనిపిస్తుంది. ఈ సినిమా కోసం బరువు తగ్గిన NTR, ఏప్రిల్ 12 నుండి సెట్స్ పైకి రానున్నట్టు తెలుస్తుంది. ఈ విషయంలో అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే రాలేదు కానీ, మ్యాగ్జిమం సినిమా ఫస్ట్ షెడ్యూల్ ఏప్రియల్ సెకండ్ వీక్ లో బిగిన్ అయ్యే చాన్సెస్ ఉన్నాయన్న టాక్ టాలీవుడ్ లో కాస్త స్ట్రాంగ్ గానే వినిపిస్తుంది.

పూజా హెగ్డే హీరోయిన్ గా నటించనున్న ఈ సినిమాలో NTR మిలిటరీ ఆఫీసర్ గా కనిపిస్తాడట. తమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.

జై లవకుశ లాంటి పవర్ ప్యాక్డ్ యాక్షన్ ఎంటర్ టైనర్ తరవాత NTR చేస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ స్థాయిలో క్రేజ్ క్రియేట్ అయింది. త్రివిక్రమ్ మార్క్ ఫ్యామిలీ ఎలిమెంట్స్ తో తెరకెక్కనున్న ఈ సినిమాను హారిక & హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై చినబాబు నిర్మిస్తున్నాడు.