సైరా సెట్స్ పైకి నయనతార

Tuesday,March 20,2018 - 12:00 by Z_CLU

ఫాస్ట్ పేజ్ లో షూటింగ్ జరుకుంటుంది మెగాస్టార్ ‘సైరా’ మూవీ.  ఈ రోజు నుండే  నయనతార కూడా ఈ సినిమా సెట్స్ పైకి వచ్చేసింది. ప్రస్తుతం సినిమాలోని కీలక సన్నివేశాలను తెరకెక్కించే ప్రాసెస్ లో ఉన్న సినిమా యూనిట్, హైదరాబాద్ లో వేసిన భారీ సెట్ లో షూటింగ్ జరుపుకుంటుంది.

స్వాతంత్ర సమరయోధుడు నరసింహా రెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మెగాస్టార్ పవర్ ఫుల్ క్యారెక్టర్ లో మెస్మరైజ్ చేయనున్నాడు. దానికి తోడు బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ కూడా ఈ సినిమాలో కీ రోల్ ప్లే చేయడం సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేస్తుంది. బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ ని ఫిక్స్ చేసుకున్న ఈ సినిమా సెట్స్ పైకి ఈ నెల 28 నుండి రానున్నాడు బిగ్ బి.

కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి  రామ్ చరణ్ ప్రొడ్యూసర్. సురేందర్ రెడ్డి  డైరెక్టర్. ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ ని అఫీషియల్ గా అనౌన్స్ చేయాల్సి ఉంది.