రామ్ చరణ్ కరియర్ లోనే బెస్ట్ సినిమా ‘రంగస్థలం’

Tuesday,March 20,2018 - 04:23 by Z_CLU

మార్చి 30న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతుంది రామ్ చరణ్ రంగస్థలం. ఇప్పటికే రిలీజైన ఈ సినిమా ట్రైలర్, సాంగ్ ప్రోమోస్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. వాటితో పాటు సినిమా ప్రమోషన్ లో భాగంగా సమంతా, ఈ సినిమాలో రామ్ చరణ్ ప్లే చేసిన చిట్టిబాబు క్యారెక్టర్ గురించి రివీల్ చేసింది.

“రామ్ చరణ్ ని ఈ సినిమా తరవాత ‘బిఫోర్ రంగస్థలం – ఆఫ్టర్ రంగస్థలం’ అని గుర్తిస్తారు. ఆ రేంజ్ లో ఈ సినిమా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే చిట్టిబాబు క్యారెక్టర్ కి తన పర్ఫామెన్స్ తో ప్రాణం పోశాడు రామ్ చరణ్. ఆ క్యారెక్టర్ గురించి ఎంత మాట్లాడినా తక్కువే. రామ్ చరణ్ కరియర్ లో చిట్టిబాబు ఐకానిక్ క్యారెక్టర్ లా మిగిలిపోతుంది.” అని ఎగ్జైటెడ్ గా చెప్పుకుంది సమంతా.

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ ఫ్యాన్స్ లో వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తుంది. DSP మ్యూజిక్ ఇప్పటికే సూపర్ హిట్టయింది.