MahaSamudram - అఫీషియల్ ఎనౌన్స్ మెంట్

Monday,September 07,2020 - 01:57 by Z_CLU

శర్వానంద్ హీరోగా అజయ్ భూపతి డైరెక్షన్ లో ‘MahaSamudram’ సినిమా తెరకెక్కనుందని ఎప్పటి నుండో ప్రచారం జరుగుతుంది. తాజాగా ఈ సినిమాను అఫీషియల్ గా ఎనౌన్స్ చేసారు మేకర్స్. RX 100 తో దర్శకుడిగా బ్లాక్ బస్టర్ ఎంట్రీ ఇచ్చిన Ajay Bhupathi ఎట్టకేలకు రెండో సినిమాను సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు.

యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తయింది. త్వరలోనే సినిమా షూటింగ్ మొదలు కానుంది. ప్రస్తుతం క్యాస్టింగ్ తో పాటు లోకేషన్స్ సెలెక్ట్ చేసే పనిలో ఉన్నాడు అజయ్.

సరిలేరు నీకెవ్వరు తో సంక్రాంతి బ్లాక్ బస్టర్ డెలివరీ చేసిన AK Entertainments బ్యానర్ పై అనిల్ సుంకర ఈ సినిమాను నిర్మించనున్నాడు. మిగతా వివరాలు అతి త్వరలోనే వెల్లడించనున్నారు. ఇదొక మల్టీస్టారర్ మూవీ. Sharwanand తో పాటు మరో హీరో నటించబోతున్నాడు.

మూవీకి సంబంధించి ఇకపై ప్రతివారం ఓ అప్ డేట్ ఇవ్వబోతున్నారు.