NTR Birthday Special - వరుస ప్రకటనలు?

Tuesday,May 18,2021 - 02:46 by Z_CLU

మరో 2 రోజుల్లో తన బర్త్ డేను సెలబ్రేట్ చేసుకోబోతున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. మరి ఈ బర్త్ డేకిఎన్టీఆర్ నుంచి ఎలాంటి సర్ ప్రైజ్ ఉండబోతోంది. ప్రస్తుతానికైతే దీనిపై పూర్తిస్థాయిలో క్లారిటీ లేదు. కానీ కచ్చితంగా ఎన్టీఆర్ అప్ కమింగ్ మూవీస్ నుంచి సర్ ప్రైజెస్ అయితే మాత్రం ఉన్నాయి.

RRR
రాజమౌళి దర్శకత్వంలో RRR Movie చేస్తున్నాడు ఎన్టీఆర్. ఈ సినిమా నుంచి ఇప్పటికే ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ తో పాటు, ఎన్టీఆర్ టీజర్ కూడా రిలీజైంది. ఈ పుట్టినరోజుకు కూడా RRR Movie నుంచి సర్ ప్రైజ్ ఉంది. ఓ బ్రాండ్ న్యూ పోస్టర్ ను రిలీజ్ చేయాలని యూనిట్ భావిస్తోంది. ఈ మేరకు 3 పోస్టర్ల నుంచి ఓ లుక్ ను రాజమౌళి లాక్ చేశాడు. ఆ ట్రెండింగ్ రేపట్నుంచి మొదలుకాబోతోంది.

ఎన్టీఆర్-మైత్రీ మూవీ మేకర్స్
NTR పుట్టినరోజు సందర్భంగా మైత్రీ మూవీ మేకర్స్ నుంచి కూడా ఓ ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఈ బ్యానర్ పై ఎన్టీఆర్ తో సినిమా చేసేందుకు ఇద్దరు రెడీగా ఉన్నారు. కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ సినిమా ఆల్రెడీ లాక్ అయింది. రీసెంట్ గా ఎన్టీఆర్ కూడా ఈ ప్రాజెక్టు ఉందని ప్రకటించాడు. ఇక ఇదే బ్యానర్ పై ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబుతో కూడా ఓ సినిమా ఉంది. అది ఎన్టీఆర్ తోనే అని టాక్. మరి ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా అఫీషియల్ ప్రకటన వస్తుందో చూడాలి.

ఎన్టీఆర్-కొరటాల సినిమా
ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ చేయబోయే సినిమా ఇదే. అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ కూడా వచ్చేసింది. ఇప్పుడీ ప్రాజెక్టు నుంచి తారక్ బర్త్ డేకి ఏదైనా అప్ డేట్ వస్తుందేమో చూడాలి. సినిమాకు సంబంధించి టైటిల్ ఎనౌన్స్ చేసే ఛాన్స్ ఉందంటూ రూమర్స్ వినిపిస్తున్నాయి. లేకపోతే, హీరోయిన్ ఎవరనే విషయాన్ని కూడా అఫీషియల్ గా ప్రకటించే ఛాన్స్ ఉంది.

వీటికి సంబంధించి 20వ తేదీన ఏదో ఒక హంగామా ఉండే అవకాశం ఉంది. ఇక ఎన్టీఆర్ విషయానికొస్తే, కరోనా బారిన పడిన తారక్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. అందుకే ఈ పుట్టినరోజుకు ఎవ్వరికీ అందుబాటులో ఉండడం లేదు యంగ్ టైగర్.

  • – Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics