RRR: రిలీజ్ డేట్ ఫిక్స్

Thursday,March 14,2019 - 01:28 by Z_CLU

మోస్ట్ ఎవెయిటింగ్ మూవీ RRRకు సంబంధించి రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమా వస్తుందనే రూమర్లకు చెక్ చెబుతూ రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేశారు మేకర్స్. వచ్చే ఏడాది జులై 30న RRRను వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ చేస్తామని ప్రకటించారు.

ఈ సినిమాకు సంబంధించి మరో హైలెట్ కూడా ఉంది. దేశవ్యాప్తంగా బాహుబలి సిరీస్ హిట్ అవ్వడంతో.. RRRను వివిధ భాషల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో ఒకేసారి విడుదల చేస్తూనే.. అదనంగా మరో 6 భాషల్లో వివిధ తేదీల్లో సినిమాను విడుదల చేస్తామని నిర్మాత డీడీవీ దానయ్య ఎనౌన్స్ చేశాడు.

ఇక మూవీ అప్ డేట్స్ విషయానికొస్తే, తాజాగా ఈ సినిమా షెడ్యూల్ హైదరాబాద్ లో పూర్తయింది. దీంతో 2 షెడ్యూల్స్ కంప్లీట్ అయ్యాయి. నెలాఖరుకు అహ్మదాబాద్, పూణెలో మరో షెడ్యూల్ ప్లాన్ చేశారు. ఇది దాదాపు 30 రోజుల పాటు ఉండబోతోంది. పూణె షెడ్యూల్ లో అజయ్ దేవగన్ వచ్చి చేరుతాడు.