RRR NTR - తారక్ బర్త్ డే పోస్టర్ రిలీజ్
Thursday,May 20,2021 - 01:08 by Z_CLU
ఆర్ఆర్ఆర్ నుంచి మరో పోస్టర్ వచ్చింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా RRR Movie నుంచి తారక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. చేతిలో బల్లెం పట్టుకొని తీక్షణంగా గురిచూస్తున్న ఎన్టీఆర్ ఎగ్రెసివ్ లుక్ ను రిలీజ్ చేశారు.

RRR Movie నుంచి ఎన్టీఆర్ లుక్స్ ఇప్పటివరకు చాలానే వచ్చాయి. ఓ లుక్ లో ముస్లిం యువకుడిగా, మరో లుక్ లో పోరాడ యోధుడిగా, ఇంకో లుక్ లో బుల్లెట్ పై దూసుకుపోయే కుర్రాడిలా.. ఇలా చాలా లుక్స్ రిలీజయ్యాయి. వాటన్నింటికీ భిన్నంగా ఈరోజు రిలీజైంది NTR Look.
పోస్టర్ రిలీజ్ సందర్భంగా ఎన్టీఆర్ పై తనకున్న అభిమానాన్ని మరోసారి చాటుకున్నాడు దర్శకుడు రాజమౌళి. ఎన్టీఆర్ ను మెచ్చుకుంటూనే, సినిమాలో అతడు పోషించిన భీమ్ పాత్ర గురించి చెప్పుకొచ్చాడు. “మా భీమ్ ది బంగారం లాంటి మనసు. కానీ ఆయన తిరుగుబాటు చేస్తే బలంగా, ధైర్యంగా నిలబడతాడు” అంటూ కొమరం భీమ్ క్యారెక్టరైజేషన్ ను వివరించాడు.
“వాడి పొగరు ఎగిరే జెండా.. వాడి ధైర్యం చీకట్లని చీల్చే మండుటెండ. వాడు భూతల్లి చనుబాలు తగిన మన్యం ముద్దుబిడ్డ. నా తమ్ముడు గోండు బెబ్బులి కొమురం భీమ్” అంటూ గతేడాది రామ్‌చరణ్ వాయిస్‌తో తారక్ పాత్రను అభిమానులకు పరిచయం చేసింది RRR టీమ్. ఇప్పుడు మరోసారి అంతే ఎగ్రెసివ్ లుక్ లో ఉన్న తారక్ పోస్టర్ ను రిలీజ్ చేసింది.
పక్కా కమర్షియల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తోంది RRR Movie. రాజమౌళి డైరక్షన్ లో 450 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కొమరం భీమ్ గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ కనిపించబోతున్నారు. అలియాభట్, అజయ్ దేవగన్ మరో 2 కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. డీవీవీ దానయ్య ఈ సినిమాకు నిర్మాత.
- – Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics