పవన్ డైరెక్టర్ తో ఫిక్స్ .....

Friday,December 09,2016 - 04:00 by Z_CLU

ఎట్టకేలకి యంగ్ టైగర్ ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమా డీటెయిల్స్ అనౌన్స్ చేశారు యూనిట్. జనతా గ్యారేజ్ రిలీజ్ అయి చాలా నెలలే అవుతున్న తన నెక్స్ట్ సినిమా విషయం లో ఇప్పటి వరకూ సస్పెన్స్ మెయింటేన్ చేసాడు తారక్. మొన్నటి వరకూ తారక్ నెక్స్ట్ డైరెక్టర్స్ గా పూరి జగన్నాథ్, అనిల్ రవిపూడి,త్రివిక్రమ్ ల పేర్లు వినిపించగా ఫైనల్ గా డైరెక్టర్ బాబీ కె ఓటేశాడు యంగ్ టైగర్.

మొన్నటి వరకూ వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా రాబోతుందనే టాక్ వినిపించింది. అయితే యూనిట్ ఈ సినిమా విషయం లో ఎలాంటి అనౌన్స్ మెంట్ చెయ్యకపోవడం తో అసలు ఈ కాంబినేషన్ ఉంటుందా? లేదా? అనే అనుమానం అందరిలో కల్గింది. లేటెస్ట్ గా ఈ కాంబినేషన్ లో సినిమాను అఫీషియల్ గా అనౌన్స్ చేసేసాడు నందమూరి కళ్యాణ్ రామ్. ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై తాను నిర్మాతగా ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కే సినిమాను బాబీ డైరెక్ట్ చేయనున్నాడని సోషల్ మీడియా ద్వారా అనౌన్స్ చేసాడు కళ్యాణ్ రామ్. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమా జనవరి నుండి స్టార్ట్ కానుందని సమాచారం.

 

kalyan-ram-tweet