త్వరలో NTR బయోపిక్ టీజర్

Tuesday,January 16,2018 - 05:28 by Z_CLU

తేజ డైరెక్షన్ లో తెరకెక్కనున్న NTR బయోపిక్ ప్రీ ప్రొడక్షన్ పనులు ఫాస్ట్ పేజ్ లో జరుగుతున్నాయి. NTR లైఫ్ లోని ఆసక్తికర అంశాలతో తెరకెక్కనున్న ఈ సినిమా టీజర్ ని  రీసెంట్ గా తెరకెక్కించింది సినిమా యూనిట్. అయితే అందరూ అనుకున్నట్టు ఈ సినిమా టీజర్ NTR వర్థంతి రోజు రిలీజ్ అవ్వడం లేదు.

బిగినింగ్ లో ఈ సినిమా టీజర్ ని NTR వర్థంతి సందర్భంగా జనవరి 18 న రిలీజ్ చేయాలని ప్లాన్ చేసుకున్న సినిమా యూనిట్, ఆలోచన మార్చుకున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఎగ్జాక్ట్ రీజన్ అయితే తెలీదు కానీ, ఈ సినిమా చుట్టూరా నందమూరి ఫ్యాన్స్ లో రేజ్ అవుతున్న క్యూరాసిటీకి తగ్గట్టు, రైట్ టైమ్ చూసుకుని టీజర్ రిలీజ్ చేసే ఆలోచనలో ఉంది తేజ టీమ్.

‘జై సింహా’ లాంటి మాసివ్ సక్సెస్ తరవాత తన కంప్లీట్ ఫోకస్ ఈ బయోపిక్ పై ఫిక్స్ చేశాడు బాలయ్య. తేజ డైరెక్షన్ లో  తెరకెక్కుతున్న ఈ సినిమాని సాయి కొర్రపాటి వారాహి చలన చిత్రం బ్యానర్ పై నిర్మిస్తున్నాడు.